విశ్వనాథ్ అండ్ సన్స్.. స్మార్ట్ మూవ్
ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ రేట్లు అమాంతం పెంచేయడం ఒక ట్రెండ్ లా మారిపోయింది. కానీ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మాత్రం ఈ రూట్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది.
ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ రేట్లు అమాంతం పెంచేయడం ఒక ట్రెండ్ లా మారిపోయింది. కానీ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మాత్రం ఈ రూట్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం ఎలాంటి రేట్ల పెంపు లేకుండా నార్మల్ ప్రైస్ కే టికెట్లు ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించడానికి ఇదొక స్మార్ట్ ప్లాన్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకమే మేకర్స్ కి ఇంత కాన్ఫిడెన్స్ ఇస్తోందని అర్థమవుతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్, క్యూట్ రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. పక్కా కమర్షియల్ హంగుల కంటే కూడా కథలోని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ని గట్టిగా నమ్ముకుని ఈ ప్రాజెక్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దినట్లు విజువల్స్ చెబుతున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.
ఇందులో సూర్యకు జోడీగా నటించిన మమితా బైజు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది. ఆమె ఎనర్జిటిక్ యాక్టింగ్ తో పాటు చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఈ పాజిటివిటీని అమాంతం పెంచేస్తున్నాయి. రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోయే తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సూర్య ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ తో రిలీజ్ వీక్ లో సినిమా మీద మరింత స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. రేట్ల పెంపు లేకపోవడం అనే ఒకే ఒక్క పాయింట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఫ్యామిలీస్ అంతా కలిసి సినిమాకి వెళ్లాలంటే బడ్జెట్ గురించి ఆలోచించుకునే ఈ రోజుల్లో, మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఫుట్ ఫాల్స్ తీసుకురావడం ఖాయం.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. కంటెంట్ తో మెప్పించడమే కాకుండా, సామాన్య ప్రేక్షకుడి జేబుకు ఏమాత్రం భారం కాకుండా వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో సూర్య పాత్ర కూడా డిఫరెంట్ షేడ్స్ లో ఉండబోతోంది.