సూర్య పాన్ ఇండియా టార్గెట్..!
ఇక ఈ సినిమా తర్వాత సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ తర్వాత సూర్య చేస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ లో వెనకపడి ఉన్నాడు. ఆకాశమే హద్దు, జై భీం లాంటి సినిమాలు సక్సెస్ ఇచ్చినా కూడా సూర్య నుంచి కమర్షియల్ సినిమా ఒకటి కావాలని ఫ్యాన్స్ ఆశించారు. ఐతే ఫ్యాన్స్ కోరిక మేరకు కంగువ, రెట్రో లాంటి సినిమాలు చేసినా అవి రెండు కూడా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా కంగువ సినిమా అయితే 200 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించగా అది కాస్త డిజాస్టర్ అయ్యింది. ఐతే కంగువ తర్వాత రెట్రో అంటూ వింటేజ్ సూర్యని కార్తీక్ సుబ్బరాజు ప్రయత్నించినా సరే వర్క్ అవుట్ కాలేదు.
సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా..
ఇక ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం ఆర్జే సూర్య డైరెక్షన్ లో కరుప్పు సినిమా చేశాడు. ఆ సినిమా అంతా పూర్తై రిలీజ్ కు రెడీగా ఉంది. నవంబర్ రెండో వారంలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ తర్వాత సూర్య చేస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కమర్షియల్ సక్సెస్ అందుకుంటున్నాడు వెంకీ అట్లూరి,
సూర్యతో వెంకీ చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ టార్గెట్ ని దృష్టిలో పెట్టుకుని వస్తుంది. సినిమా విషయంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారని తెలుస్తుంది. సూర్య, వెంకీ అట్లూరి ఇద్దరు కలిసి మరో మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఐతే సార్, లక్కీ భాస్కర్ ముందు వెంకీ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు. అలాంటి డైరెక్టర్ లో ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ స్టఫ్ ఉందని ఆడియన్స్ ఊహించలేదు. ముఖ్యంగా లక్కీ భాస్కర్ సినిమా ఐతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
ప్రేమలుతో సూపర్ హిట్ అందుకున్న మమితా బైజు..
అందుకే సూర్య వెంకీ అట్లూరి మీద హోప్స్ పెట్టుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా విషయంలో సూర్య కూడా చాలా హైప్ తో ఉన్నాడు. సితార బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ప్రేమలుతో సూపర్ హిట్ అందుకున్న మమితా బైజు ఈమధ్యనే వచ్చిన డ్యూడ్ తో మరో హిట్ అందుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ సూర్య సినిమాతో కూడా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందట. సూర్య మాత్రం ఈసారి టార్గెట్ మిస్ అవ్వకుండా కచ్చితమైన ప్లానింగ్ తో వెళ్తున్నారని తెలుస్తుంది.