ఎట్టకేలకు 15 ఏళ్లకు బరిలోకి ఆ స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ సూర్యకు సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో? కథల పరంగా సూర్య మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.;
కోలీవుడ్ స్టార్ సూర్యకు సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో? కథల పరంగా సూర్య మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ప్రయోగా నికి..కమర్శియాల్టీకి పోకుండా మధ్యస్త కథల్ని ఎంచుకుంటున్నారు. రిస్క్ చేయడం కంటే సక్సెస్ వచ్చే వరకూ కంపర్ట్ జోన్ లోనే సినిమాలు చేయాలని ముందుకు కదులుతున్నారు. గత ఏడాది ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య ఈ ఏడాది మాత్రం ఏకంగా బ్యాక్ టూ బ్యాక్ మూడు రిలీజ్ లతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు.
అదీ ఆరు నెలల వ్యవధిలోనే ఈ మూడు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో `కరుప్పు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మే 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో `వీరభద్రుడు` టైటిల్ తో రిలీజ్ అవుతుంది. సూర్య మార్కు యాక్షన్- ఆర్.జె. బాలాజీ శైలి వినోదం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే `విశ్వనాధ్ అండ్ సన్స్` తో సూర్య టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దర్శకత్వంలో ఇదో క్లాసిక్ చిత్రంగా రూపొందుతుంది. వెంకీ మార్క్ సెన్సిబిలిటీస్ తో ఫ్యామిలీ డ్రామాగా హైలైట్ కానుంది. ఈ సినిమాకు టైటిలే ఎంతో క్యాచీగా ఉంది. నిజంగా ఈ కథ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే? సూర్యకు బెస్ట్ లాంచింగ్ మూవీగా నిలిచిపోతుంది. ఈ సినిమాను జూలై లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే `ఆవేశం` చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ సూర్య 47వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇందులో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తోంది. అన్ని పనులు పూర్తి చేసి ఇదే ఏడాది ద్వితియార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. మలయాళీ మేకింగ్ స్టైల్‌లో సూర్యను సరికొత్తగా చూపించబోతున్న ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ లోహాట్ టాపిక్‌గా మారింది. ఇలా ఒకే ఏడాది ఆరు నెలల వ్యవధిలోనూ సూర్య నటించిన మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా అరుదు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం సూర్య నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు..ఒకటి తప్ప రిలీజ్ చేసింది లేదు. మళ్లీ ఇంత కాలానికి 2026 ఏడాది మూడు రిలీజ్ లకు వేదికగా మారింది. అలాగే సూర్య ల్యాండ్ మార్క్ 50వ చిత్రం కూడా లాక్ అయింది. సామాజిక అంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ మైలురాయి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కలైపులి ఎస్. థాను ప్రతీష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది.