సూర్య.. ఒక సినిమా వల్ల ఇంకో సినిమాకు ఇక్కట్లు
కరుప్పు ను 2025 దీపావళికి, సూర్య 46 ను 2026 మే లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారు.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం రెండు విభిన్న జానర్ల చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో సోషల్ మెసేజ్ తో కూడిన డ్రామా కరుప్పు ఒకటి కాగా, రెండో చిత్రం సూర్య 46 (ప్రాజెక్ట్ టైటిల్). ఇందులో కరుప్పు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇంకోటి వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఇధి ఇది క్లాస్-కమర్షియల్ మిక్స్‌గా రూపొందనుంది. మొదట ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఖచ్చితంగా నిర్ణయించినట్టు చిత్రబృందాలు ప్రకటించాయి.
కరుప్పు ను 2025 దీపావళికి, సూర్య 46 ను 2026 మే లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ షెడ్యూల్‌లో పెద్ద మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. కరుప్పు సినిమాకు సంబంధించి ఓటిటీ (OTT) రైట్స్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆ సినిమా విడుదలను 2026 ఏప్రిల్ 14కి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
ఇదే జరిగితే, సూర్య 46 సినిమాను, ఆ తర్వాత నెలలోనే రిలీజ్ చేయడం వీలు కాదు. ఎందుకంటే ఒకే హీరో రెండు సినిమాలకు మధ్య కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలి. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా తర్వాత మరో సినిమా రాబోవాలంటే కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలన్న నిబంధన సాధారణంగా పాటిస్తున్నారు.
ఈ క్రమంలో సూర్య 46ని జూలై లేదా ఆగస్ట్ 2026కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీని వల్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనవుతున్నా, చిత్ర యూనిట్లు తమ సినిమాల మార్కెట్ ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మొత్తానికి, సూర్య అభిమానులకు త్వరలో సూర్యను బిగ్ స్క్రీన్ పై చూసే చాన్స్ ఉండదు. అయితే ఈ రెండు సినిమాలపై హైప్ మాత్రం ఇప్పటికే ఏర్పడింది. అయితే కరుప్పు లో సూర్య విభిన్న పాత్రలో కనిపించనున్నారని టాక్ ఉండగా, సూర్య 46 లో ఆయనను మాస్ మసాలా అవతారంలో చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాత్రలు ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మీల్స్ ఇస్తాయి.
అయితే సూర్యకు ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అవసరం. ఆయన గతకొంత కాలంగా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. భార అంచనాలతో వచ్చిన కంగువా, రెట్రో బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు సినిమాలు ఆయనకు చాలా ఇంపార్టెంట్.