• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ షాక్.. చావు నుంచి...

బిగ్ షాక్.. చావు నుంచి బయటపడ్డ హీరోయిన్..!

| ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను. ఈ ఇన్సిడెంట్ వల్ల తన పాజిటివిటీ మరింత బలంగా మారిందని రాసుకొచ్చింది సురభి.

By - Tupaki Desk
Update: 2024-03-19 07:44 GMT

తెలుగులో పలు సినిమాల్లో నటించిన సురభి తన ఇన్ స్టా స్టోరీతో షాక్ ఇచ్చింది. జస్ట్ మిస్ చావు నుంచి బయట పడ్డా అని సురభి తన ఇన్ స్టా స్టేటస్ లో రాసుకొచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది అంటే సురభి ఎక్కివ ఫ్లైట్ లో టెక్నికల్ సమస్యల వల్ల ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యిందట. దాదాపు ఫ్లైట్ క్రాష్ అవుతుందనే అనుకున్నారట. అందులో సురభితో పాటు చాలామంది ప్రయాణీకులు కూడా ఉన్నారట. పైలట్ చాకచక్యం వల్ల అతను తమని సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశాడని సురభి తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో రాసుకొచ్చింది.


ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను. ఈ ఇన్సిడెంట్ వల్ల తన పాజిటివిటీ మరింత బలంగా మారిందని రాసుకొచ్చింది సురభి. సురభి షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ చూసి ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. తెలుగులో యువ హీరోలతో కలిసి నటించిన సురభి చేసిన కొన్ని సినిమాలతో అయినా యూత్ ఆడియన్స్ ని మెప్పించింది.

కెరీర్ అంత దూకుడుగా లేకపోయినా సరే అడపాదడపా అమ్మడు దర్శనమిస్తుంది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో సురభి ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. లాస్ట్ ఇయర్ తమిళంలో సంతానం హీరోగా నటించిన డిడి రిటర్న్స్ సినిమాలో నటించి మెప్పించిన సురభి అటు కన్నడ సినిమాల్లో కూడా రాణించాలని చూస్తుంది.

కెరీర్ మొదట్లో ఆడియన్స్ మనసులు దోచిన చిన్నది ఆ తర్వాత సినిమాల ఎంపిక వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. విశ్వంభర సినిమాలో ఛాన్స్ మళ్లీ సురభిని వార్తల్లో నిలిచేలా చేసింది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలోనే తన ఫోటో షూట్స్ తో అలరించే సురభి లేటెస్ట్ గా చావు నుంచి బయటపడ్డా అనే పోస్ట్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఆమె క్షేమంగా ఉన్న విషయం తెలిసి ఆమె ఫాలోవర్స్ హమ్మయ్య అనుకున్నారు. ఈమధ్య రష్మిక కూడా తను ప్రయాణిస్తున్న ఫ్లైట్ టెక్నికల్ సమస్యల వల్ల ఇబ్బంది పడ్డామని.. జస్ట్ మిస్ చావు నుంచి తప్పించుకున్నానని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

Tags:    
  • Surabhi 
  • Actress 
  • Flight 
  • Viswambhara 
  • Ddreturns 
  • Santhanam 
  • Chiranjeevi 
  • Filmindustry 
  • Flightlanding 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS