SS Creations లోగో అర్థం ఏంటి? వెనుక ఉన్న సింబాలిజం ఇదే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రొడ్యూసర్ సుప్రియ యార్ల‌గ‌డ్డ గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు.;

Update: 2026-04-09 07:04 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రొడ్యూసర్ సుప్రియ యార్ల‌గ‌డ్డ గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు. డెకాయిట్ ప్రీ రిలీజ్ అగ్ర నిర్మాతలైన మైత్రి రవి, సితార‌ నాగ వంశీ ఆమె స్ట్రిక్ట్ నేచర్ గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అదే వేదికపై సుప్రియ చూపించిన ఎమోషనల్ సైడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన కుటుంబ వారసత్వాన్ని మళ్లీ ప్రాణం పోసే క్రమంలో తిరిగి ప్రారంభించిన SS క్రియేష‌న్స్ బ్యానర్‌కు సంబంధించిన లోగో వెనుక ఉన్న ఎమోష‌న‌ల్ స్టోరీని ఆమె ఎంతో హృదయపూర్వకంగా వివరించారు. ఈ లోగోలో ప్రతి అంశం తమ కుటుంబ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె చెప్పిన విధానం ప్రేక్షకులను కదిలించింది.

లోగోలో ఫ్యామిలీ క‌థ‌

ప్రత్యేకంగా, తన తాత పంచెను లోగోలో చేర్చడం ద్వారా ఆయన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. అలాగే అందులో ప‌రిగెత్తే పాప త‌న కూతుర‌ని, పాపను ముందుకు న‌డిపిస్తున్న తాత‌య్య‌, తన అమ్మమ్మ అన్న‌పూర్ణ‌మ్మ గారి కుంకుమను కుటుంబ ఆత్మీయతకు ప్రతీకగా చూపించారు. ఇక తన తండ్రి కావాల‌ని చేయించుకున్న గాయ‌మం మూవీలోని మ్యూజిక్ ను లోగోలో భాగం చేసి వారి జ్ఞాప‌కాల‌ను స్పెష‌ల్ గా మ‌ల‌చుకున్నారు.

నేను వైలెంట్, సుమంత్ సైలెంట్

ఈ విషయాలను చెప్పే క్రమంలో సుప్రియ భావోద్వేగానికి లోనై, కొద్దిసేపు ఆగి మాట్లాడిన సందర్భం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. అదే సమయంలో తన స్టైల్‌లో సరదాగా మాట్లాడుతూ, SS Creations లో ఒక S అయిన తాను కొంచెం వైలెంట్, మరొక S అయిన సుమంత్ సైలెంట్ అని చెప్పి అందరినీ నవ్వించారు. ఇక్కడ సుమంత్ పాత్రను కూడా ఆమె ప్రస్తావించడం విశేషం.

లోగో కోసం చాలా ఆలోచించా

లోగో డిజైన్ విషయంలో కూడా ఆమె పెట్టిన కష్టాన్ని వివరించారు. 15 సెకన్లలో మా కథను ఎలా చెప్పాలి అన్న ఆలోచనతో చాలా సార్లు ప్రయత్నించాన‌ని, సినిమా ప్రారంభించే ముందు ఓ లోగో చేయాలని అనుకున్నాన‌ని, కానీ అది అంత ఈజీ కాలేద‌ని, సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు పట్టినట్లే, లోగో ఫైనలైజ్ కావడానికి కూడా అంతే సమయం పట్టింది. నిజానికి నిన్ననే లోగో ఫైనల్ చేశామ‌ని ఆమె చెప్పడం ఆమె ప్యాషన్‌కు నిదర్శనంగా నిలిచింది.

తన తండ్రి ప్రారంభించిన బ్యానర్‌ను తిరిగి ప్రారంభించడం తన కల అని, అది డెకాయిట్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాతో సాధ్యమవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సుప్రియ తెలిపారు. డైరెక్ట‌ర్ షానియ‌ల్ డియో తెరకెక్కించిన ఈ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా, కీల‌క పాత్ర‌లో అనురాగ్ క‌శ్య‌ప్ క‌నిపించ‌నున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



Tags:    

Similar News