• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు గెస్ట్ రోల్.....

మహేష్ బాబు గెస్ట్ రోల్.. ఏం జరిగింది?

| అయితే మహేష్ బాబు వారి ఆఫర్ ని ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదంట. అలాగే ఆ చిత్ర యూనిట్ కి నో అని చెప్పలేదంట

By - Tupaki Desk
Update: 2023-09-04 06:37 GMT

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కూడా కాస్తా తమ స్టైల్ మార్చుకున్నారు. భాషలతో సంబంధం లేకుండా ఇతర హీరోల చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలలో నటిస్తున్నారు. అలాగే సౌత్ హీరోలు బాలీవుడ్ సినిమాలలో కీలక పాత్రలతో పాటు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మూవీ టీం తమ సినిమాలో గెస్ట్ రోల్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించారట

అయితే మహేష్ బాబు వారి ఆఫర్ ని ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదంట. అలాగే ఆ చిత్ర యూనిట్ కి నో అని చెప్పలేదంట. దీంతో ఏమైనా గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందా అనే డౌట్ అందరికి వస్తోంది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎవరి సినిమాలలో కూడా మహేష్ బాబు గెస్ట్ రోల్స్ చేయలేదు. అయితే ఒక సీరియల్ లో మాత్రం ఆరంభంలో గెస్ట్ రోల్ లో మహేష్ బాబు కనిపించారు.

మరి ఈ సారి తాను పెట్టుకున్న ఈ రూల్స్ ని మహేష్ బాబు బ్రేక్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. ఒక వేళ మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకుంటే మాత్రం వారికి ప్లస్ అయినట్లే. యితే సూపర్ స్టార్ మహేష్ బాబుని గెస్ట్ రోల్ కోసం సంప్రదించిన టీమ్ ఎవరా అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది.

వీలైనంత వేగంగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ ఏడాదిలోనే జక్కన్న మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయంట.

ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించే ఛాన్స్ లు ఉన్నాయంట. ప్రస్తుతం మూవీ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో విజయేంద్రప్రసాద్ ఉన్నారు. అతను స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత జక్కన్న వర్క్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో తెలుగు నుంచి పాన్ ఇండియా బాట పట్టబోతున్న చివరి స్టార్ హీరో మహేష్ బాబు అని చెప్పొచ్చు.

Tags:    
  • Maheshbabu 
  • Tollywood 
  • Gunturkaaram 
  • Trivikram 
  • Rajamouli 
  • Guestrole 
  • Superstar 
  • Maheshguestrole 

Similar News

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

Copyright @2026

Powered by Blink CMS