సూపర్ స్టార్ సింప్లిసిటీకి ఫిదా అవాల్సిందే!
సినిమాల్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఎంతో స్టైల్ గా, ఓ స్వాగ్ తో నడుచుకుంటూ వెళ్లే ఆయన రియల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా కనిపిస్తారు;
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఎంతో స్టైల్ గా, ఓ స్వాగ్ తో నడుచుకుంటూ వెళ్లే ఆయన రియల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే రియల్ లైఫ్ లో రజినీ ఎదురైతే సడెన్ గా ఆయనే అని గుర్తు పట్టడం కూడా కష్టం. అంత సింపుల్ గా ఉంటారు రజినీకాంత్.
రజినీ వీడియో నెట్టింట వైరల్
తాను ఎవరు, తన ఫాలోయింగ్ ఏంటి అనేది చూపించుకోవడానికి ఎప్పుడూ ఆయన ఇష్టపడరు. కొన్ని కోట్ల మంది అభిమానులున్నప్పటికీ అంత సింపుల్ గా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. అలాంటి రజినీకాంత్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న రజినీకాంత్ ను చూస్తే ఎవరైనా విజిల్స్ వేయక మానరు.
ఎకానమీ క్లాస్‌లో రజినీకాంత్
అలాంటిది అందరిలానే సాధారణంగా ఫ్లైట్ లో తమతో కలిసి జర్నీ చేస్తున్నారంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? రజినీ ఎప్పటిలానే నార్మల్ గా ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి ఓ అభిమాని, తలైవా మీ ఫేస్ చూడాలనుంది అని గట్టిగా అరవడంతో అది విన్న రజినీ వెంటనే పైకి లేచి అక్కడి వారందరికీ అభివాదం చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
తలైవా అంటూ నినాదాలు
దీంతో ఫ్లైట్ లోని వారంతా అరుపులతో తలైవా అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రజినీకాంత్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇలా ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన సందర్భాలున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే సూపర్ స్టార్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జైలర్ కు సీక్వెల్ గా జైలర్2 షూటింగ్ లో తలైవా బిజీగా ఉన్నారు.