జనాలు లేక కరణ్ జోహార్ సినిమా విలవిల
బాలీవుడ్‌లో ధర్మ ప్రొడక్షన్స్ అంటేనే గ్రాండ్ మేకింగ్, భారీ క్యాస్టింగ్ హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.;
బాలీవుడ్‌లో ధర్మ ప్రొడక్షన్స్ అంటేనే గ్రాండ్ మేకింగ్, భారీ క్యాస్టింగ్ హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఈ సంస్థ వెనుక ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన తన లేటెస్ట్ ఫిల్మ్, 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి'పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఆశించినంత రెస్పాన్స్ రాలేదు.
ఓపెనింగ్స్ డీసెంట్‌గా ఉన్నాయని మేకర్స్ ప్రచారం చేసినా, బాలీవుడ్ మీడియాలో మాత్రం షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. సినిమాకు వస్తున్న డల్ రెస్పాన్స్ చూసి, బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే, కలెక్షన్ల కంటే దారుణమైన విషయం ఏమిటంటే, థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఇక్కడి హాట్ గాసిప్.
మధ్యప్రదేశ్‌లో ఉన్న కొన్ని 'B' క్లాస్ సెంటర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉందట. ఈ సినిమాకు ఆడియన్స్ రాకపోవడం వల్ల, మొదటి 4 రోజుల పాటు అన్ని షోలను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని సమాచారం. అంతేకాదు, ఇప్పటికీ చాలా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన మళ్ళీ మొదలుపెట్టలేదు అనే న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గుప్పుమంటోంది.
పెద్ద పెద్ద సిటీల్లోని మల్టీప్లెక్స్‌లలోనూ కలెక్షన్లు షాకింగ్‌గా డల్గా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఈ డల్ రెస్పాన్స్‌ను కవర్ చేసుకోవడానికి, ధర్మ మూవీస్ నుంచి కొన్ని ప్రముఖ సినిమా హాళ్లకు డబ్బు అందిందని మరికొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే, కార్పొరేట్ బుకింగ్ పేరుతో సినిమాను నడిపిస్తున్నారు తప్ప, నిజమైన ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం దారుణంగా ఉందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు కరణ్ జోహార్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ దారితీసిందనే కథనాలు కూడా వస్తున్నాయి. అతను ఎప్పుడూ తన తండ్రి లెగసీ గురించి గొప్పగా చెబుతాడు.
కానీ, ఇప్పుడు డబ్బులిచ్చి షోలు వేయించుకునే స్థాయికి వచ్చాడని కామెంట్స్ వస్తున్నాయి. ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్ అవ్వడం ఏ రకమైన లెగసీ అని బాలీవుడ్‌లో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మొత్తానికి, 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' ఇప్పుడు కరణ్ జోహార్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే నెపో కిడ్స్ ను ప్రమోట్ చేస్తాడనే టాక్ కూడా ఉండడంతో ఓ వర్గం జనాలు ఈ విషయాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కరణ్ పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ సినిమా కంటెంట్ విషయంలో ఆయన పట్టు తప్పుతున్నట్లు కనిపిస్తుంది. మరి రాబోయే సినిమాలతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.