స‌న్నీ ఫ్యాన్స్ దానికి ఒప్పుకుంటారా?

దక్షిణాది మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి మార్కెట్ ఉన్న న‌టుల‌ను ఈ సినిమాలో లీడ్ రోల్స్‌కు ఎంపిక చేసుకుని డైరెక్ట‌ర్ నితీశ్ తివారీ సినిమా మార్కెట్ ను విప‌రీతంగా పెంచాడు.;

Update: 2025-06-12 18:30 GMT

బాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమా రామాయ‌ణం. ఈ పౌరాణిక సినిమాలో రాముడిగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సీత‌మ్మ‌గా సాయి ప‌ల్ల‌వి, రావ‌ణుడిగా య‌ష్‌, మండోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, హ‌నుమంతుడిగా స‌న్నీ డియోల్, శూర్ప‌ణ‌ఖ‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా వ‌స్తోన్న ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది చివ‌ర్లో, రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

దక్షిణాది మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి మార్కెట్ ఉన్న న‌టుల‌ను ఈ సినిమాలో లీడ్ రోల్స్‌కు ఎంపిక చేసుకుని డైరెక్ట‌ర్ నితీశ్ తివారీ సినిమా మార్కెట్ ను విప‌రీతంగా పెంచాడు. ఈ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర పోషిస్తున్న స‌న్నీ డియోల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌జేశాడు. ద‌ర్శ‌కుడు నితీష్ క‌థ చెప్పిన విధానం త‌న‌ను చాలా ఆక‌ట్టుకుంద‌ని, ముఖ్యంగా త‌న పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం బాగా న‌చ్చి వెంట‌నే ఒప్పుకున్నాన‌ని స‌న్నీ చెప్పాడు.

స్వ‌త‌హాగా హ‌నుమంతుడి పాత్ర చాలా ప‌వర్‌ఫుల్‌గా ఉండ‌నున్న నేప‌థ్యంలో అందులోనూ స‌న్నీ డియోల్ ఈ సినిమాలో ఆ రోల్ చేయ‌నుండ‌డంతో ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతుందోన‌ని ఫ్యాన్స్ లో అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మ‌రో వైపు రామాయ‌ణంలో హ‌నుమంతుడు కొన్ని స‌న్నివేశాల్లో రాముడి పాదాల చెంత క‌నిపిస్తుంటాడు. మ‌రి ఈ సినిమాలో త‌న‌కంటే చాలా చిన్న‌వాడైన ర‌ణ్‌బీర్ సింగ్ పాదాల‌ను హ‌నుమంతుడి పాత్ర పోషిస్తున్న స‌న్నీ డియోల్ తాకే స‌న్నివేశాల్లాంటివి వ‌స్తే అత‌డి అభిమానులు ఆ సీన్స్‌ను ఆమోదిస్తారా? అనే చ‌ర్చ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఊపందుకుంది.

డైరెక్ట‌ర్ నితీశ్ తివారీ ఎక్కువ సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకోకుండా వీలైనంత వ‌ర‌కు రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగానే సినిమాను తెర‌కెక్కిస్తాన‌ని ఇది వ‌ర‌కే చెప్ప‌డంతో బాలీవుడ్‌లో విప‌రీత‌మైన స్టార్ డ‌మ్ ఉన్న స‌న్నీ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై ఆసక్తి నెల‌కుంది. మ‌రో వైపు ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుద‌ల చేయ‌నుండ‌డంతో స‌న్నీ పాత్రకి సెకెండ్ పార్ట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఉండ‌నుంద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఒక‌వేళ స‌న్నీ డియోల్, ర‌ణ్‌బీర్ పాదాల‌ను తాకాల్సి వ‌చ్చినా అది కేవ‌లం క‌థ ప్ర‌కారమే జ‌రిగింద‌నే విష‌యాన్ని ఆలోచించి దాన్ని క‌థ‌లానే చూడాలని అంద‌రూ భావిస్తున్నారు.

Tags:    

Similar News