ఆ విషయంలో గర్వంగా ఉంది
మనవరాలు పుట్టిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని సునీల్ శెట్టి తెలిపారు.;
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇటీవలే తాత అయిన విషయం తెలిసిందే. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ రీసెంట్ గానే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఈ విషయంపై సునీల్ శెట్టి తన సంతోషాన్ని, భావోద్వేగాలను షేర్ చేసుకున్నారు. తన లైఫ్ లోకి మనవరాలు అడుగుపెట్టిన తర్వాత కలిగిన అనుభూతి గురించి మాటల్లో వర్ణించలేనని ఆయన పేర్కొన్నారు.
మనవరాలు పుట్టిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని సునీల్ శెట్టి తెలిపారు. తాను కొన్ని దశాబ్దాలుగా వ్యాపార రంగంలోనూ, ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఎన్నో సాధించినప్పటికీ, తన మనవరాలిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం ఎప్పుడూ కలగదలేదని ఆయన అభిప్రాయపడ్డారు. లైఫ్ లో ఎన్నో సాధించానని గర్వించాను కానీ మనవరాలిని ఎత్తుకున్న క్షణంలో ఏవీ గుర్తుకురాలేదని ఆయన తెలిపారు.
లైఫ్ లో ఇంతకంటే స్వచ్ఛమైన ఆనందం ఈ ప్రపంచంలో మరోటి ఉంటుందనుకోనని, మనవరాలిని ఎత్తుకోగానే తనకు మంగుళూరులో జరిగిన తన బాల్యం గుర్తొచ్చిందని, చెప్పులు లేకుండా పరిగెత్తడంతో పాటూ ఆరుబయట ఆడుకోవడం, ప్రేమతో వండిన భోజనాన్ని తినడం లాంటి గొప్ప క్షణాలన్నీ తనకు గుర్తొచ్చాయని సునీల్ శెట్టి వెల్లడించారు.
మనవరాలిని చూడటమే సంతోషంగా ఉంటే, తన మనవరాలు తల్లి చేతిని పట్టుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని, తన కూతురు ఒక బిడ్డకు జన్మనివ్వడం చూశాక ఒక తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని, ఈ విషయం తన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని సునీల్ శెట్టి తెలిపారు. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మూడేళ్లు ప్రేమించుకుని, ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గతేడాది సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 24న కేఎల్ రాహుల్- అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.