'సుందరకాండ'.. మొదటి రోజుకన్నా రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్!
ఒక సినిమా బాగుంది అంటే ఆ సినిమా చూసేందుకు కచ్చితంగా ప్రేక్షకులు ముందుకొస్తారు అన్న దానికి మరో ఉదాహరణ గా నిలుస్తుంది సుందరకాండ.;
ఒక సినిమా బాగుంది అంటే ఆ సినిమా చూసేందుకు కచ్చితంగా ప్రేక్షకులు ముందుకొస్తారు అన్న దానికి మరో ఉదాహరణ గా నిలుస్తుంది సుందరకాండ. సినిమా రిజల్ట్ రివ్యూస్ మీద ఆధారపడి ఉందని కొందరు దర్శక నిర్మాతలు అంటారు. కానీ మంచి సినిమాను ఏ రివ్యూస్ ఆపలేవు. అలాంటి స్పెషల్ వైబ్ ఇస్తుంది సుందరకాండ. ఈ సినిమా విషయంలో మేకర్స్ ముందు నుంచి ఉన్న కాన్ఫిడెన్స్ చూసి అందరు మేకర్స్ ఇంతే కదా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూసి షాక్ అవుతున్నారు.
సరైన టైం లో సరైన సినిమా..
నారా రోహిత్ కి సరైన టైం లో సరైన సినిమాగా సుందరకాండ వచ్చింది. ఈ సినిమాను కంప్లీట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే సినిమా మౌత్ టాక్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఎప్పుడు చెబుతున్నట్టుగానే థియేటర్ లో రిలీజైన సినిమా పరిస్థితి ఏంటన్నది సోషల్ మీడియాలో తొంగి చూస్తే చాలు మ్యాటర్ అర్ధమవుతుంది.
రిలీజ్ రోజు నుంచి సుందరకాండ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ విషయాలు చర్చిస్తున్నారు. సినిమా ఎంటర్టైన్మెంట్, సత్య కామెడీ, ఇంటర్వెల్ ఇలా ప్రతి విషయం గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఇవే కామన్ ఆడియన్స్ ని థియేటర్ కి వెళ్లేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో సుందరకాండ తక్కువ అంచనాలతో రిలీజ్ కాగా సినిమా డే 1 వసూలు చేసిన దాని కన్నా డే 2 ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఎలాగు ఈరోజు కూడా కలెక్షన్స్ బాగుండేలా ఉన్నాయి.
సుందరకాండ మంచి ఎంటర్టైనర్..
ఇక నెక్స్ట్ వీకెండ్ టూ డేస్ మంచి ఎంటర్టైనర్ కాబట్టి కచ్చితంగా మూవీ లవర్స్ అంతా ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంది. సో ఇలా చూస్తే డే 1 కన్నా 2 దాని కన్నా 3 ఆ తర్వాత దానికి డబుల్ ట్రిపుల్ కలెక్షన్స్ ఫోర్త్ డే అంటే సాటర్డే, సండే తెచ్చేలా ఉన్నాయి. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ శ్రీరామరక్ష కాబట్టి సినిమా అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు. సో కూల్ గా వచ్చి అదిరిపోయే హిట్ సినిమా ఇచ్చాడు నారా రోహిత్.
వినాయక చవితి టార్గెట్ గా ముందు కొన్ని సినిమాలు రిలీజ్ అనుకోగా అవి రాలేదు. ఫైనల్ గా వచ్చిన సుందరకాండ సందడి బాగానే చేస్తుంది. మరి ఈ సక్సెస్ తో నారా రోహిత్ హిట్ ట్రాక్ ఎక్కినట్టే అని చెప్పొచ్చు.