ఇండియన్ సినిమా ఫెంటాస్టిక్ ఫోర్!
ఇండియన్ సినిమా మునుపటితో పోలిస్తే చాలా మారిపోయింది. బడ్జెట్ పరంగా, వసూళ్ల పరంగా హాలీవుడ్ సినిమాలతో దాదాపుగా పోటీపడుతోంది.;
ప్రతి ముప్పైఏళ్ల కొకసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది. మేకింగ్, టేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తరం నాటి ట్రెండ్ ఒకలా ఉంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం ట్రెండ్ ఒకలా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. అయితే పవన్ కల్యాణ్, మహేష్‌లు వచ్చాక ఆ మార్పులు మరింతగా పెరిగాయి. సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించాయి. అయితే భారీ మార్పులు, కోట్లల్లో బడ్జెట్‌లు మాత్రం మొదలైంది ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తరంలోనే.
ఇండియన్ సినిమా మునుపటితో పోలిస్తే చాలా మారిపోయింది. బడ్జెట్ పరంగా, వసూళ్ల పరంగా హాలీవుడ్ సినిమాలతో దాదాపుగా పోటీపడుతోంది. హాలీవుడ్ స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడంలో విజయం సాధిస్తున్నాయి. భారతీయ సినిమా ఇప్పుడు ఊహించని స్థాయి మార్పులకు నిలువెత్తు రూపంగా కనిపిస్తోంది. బడ్జెట్‌లే కాకుండా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే స్థాయిలోనూ, వసూళ్ల పరంగానూ సరికొత్త బౌండరీస్‌ని దాటేస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిలిచినవి ఫెంటాస్టిక్ ఫోర్. అవే బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2, ధురంధర్ 2.
అయితే ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది మాత్రం ప్రభాస్ నటించిన `బాహుబలి 2`. బడ్జెట్, లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ తీయడానికి, అలాంటి ఆలోచన కూడా చేయని రోజుల్లో మనం కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగలమని, కోట్లల్లో వసూళ్లని రాబట్టగలమని ఈ సినిమాతో `బాహుబలి 2` టీమ్ నిరూపించి యావత్ భారతీయ సినిమాకు సరికొత్తగా నూతన జవసత్వాలని అందించి ప్రయోగాలకు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు సిద్ధం కండని పిలుపునిచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు,లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ రూపొందుతున్నాయి.
ఈ సినిమా ఇచ్చిన ధైర్యం వల్లే `కేజీఎఫ్ 2` తెరపైకొచ్చింది. యష్, ప్రశాంత్ నీల్ చేసిన సహసం దక్షిణాది సినిమా సత్తాల ఏంటో యావత్ భారతానికి `బాహుబలి 2` తరువాత తెలియజెప్పేలా చేసింది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అందిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరిన్ని భారీ సినిమాలకు శ్రీకారం చుట్టే ధైర్యాన్నిచ్చింది.
ఈ రెండు పాన్ ఇండియా బ్లాక బస్టర్ల తరువాత దక్షిణాది నుంచి వచ్చిన భారీ యాక్షన్ డ్రామా `పుష్ప 2`. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు భారీ బడ్జెట్, లార్జర్ దెన్ లైఫ్ మూవీగా తెరపైకి రావడానికి ప్రధాన కారణం `కేజీఎఫ్ 2` సాధించిన రికార్డు స్థాయి విజయమే. ఫస్ట్ పార్ట్ 350 కోట్లు మాత్రమే రాబడితే `కేజీఎఫ్ 2` స్ఫూర్తిగా భారీ మార్పులతో విడుదలైన `పుష్ప 2` ఎవరూ ఊహించని విధింగా రూ.1600 కోట్లకు మించి వసూళ్లని సాధించడం గమనార్హం. ఈ మూడు పాన్ ఇండియా వండర్స్‌తో భారతీయ సినిమా మార్కెట్ స్వరూపమే సమూలంగా మారిపోయింది.
ఎక్కడా చూసినా..ఏ చిన్న హీరోని కదిలించినా పాన్ ఇండియా మాటే వినిపించడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే సైలెంట్‌గా వచ్చిన బాలీవుడ్ మూవీ `ధురంధర్`. కేవంల మౌత్ టాక్‌తో ఈ సినిమా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేసింది. దాదాపు రూ.1400 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సీక్వెల్‌గా విడుదలైన `ధురంధర్ 2`. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బాహుబలి టైమ్‌లో ఎలాంటి హంగామా సాగిందో ఇప్పుడు అదే సందడి కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఫస్ట్ డే రికార్డు స్థాయిలో రూ.240 కోట్లు రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లతో చరిత్ర సృష్టిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇలా భారతీయ సినిమా మార్కెట్‌తో పాటు బడ్జెట్, మేకింగ్ రూపురేఖల్ని మార్చి ఈ నాలుగు సినిమాలు ఇండియన్ సినీ హిస్టరీలో `ఫెంటాస్టిక్ ఫోర్‌గా నిలవడం ఖాయం.