నారా రోహిత్ 'సుందరకాండ'.. స్పెషల్ రొమాంటిక్ సాంగ్ విన్నారా?

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.. కాస్త గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-22 17:13 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.. కాస్త గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో తనదైన యాక్టింగ్ తో అలరించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుందరకాండతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.

వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సుందరకాండ మూవీతో వెంకటేష్ నిమ్మలపూడి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ తో పాటు వృత్తి వాఘని హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ నరేష్, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న సుందరకాండ మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి అవ్వగా.. మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, ర్యాప్ ట్రైలర్ తో పాటు గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి

అదే సమయంలో తాజాగా సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. లవ్ ఈరోజు తన స్వరాన్ని కనుగొంటుందంటూ డియర్ ఈరా పాటను తీసుకొచ్చారు. తెలిశాకే చిరునామా.. కలిగిందే ఒక ధీమా.. అంటూ సాగుతున్న పాట ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే కొత్త సాంగ్.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. ఒక్కసారిగా వినగానే అట్రాక్ట్ చేస్తోంది. నారా రోహిత్, వృత్తి వాఘని అద్భుతమైన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. కళాశాల విద్యార్థిగా రోహిత్ మేకోవర్ క్రేజీ ఉండగా, ఆయన ఆ లుక్ లో సూపర్ గా ఉన్నారు. శ్రీహర్ష ఈమని అందించిన లిరిక్స్ స్పెషల్ గా ఉన్నాయి.

లియోన్ జేమ్స్ కంపోజిషన్ అద్భుతంగా ఉంది. ఫ్రెష్ గా ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఓవరాల్ గా పాట.. రొమాంటిక్ యాంథంగా ఉంటూనే అందరినీ మెప్పిస్తోంది. కాగా.. కొత్త కాన్సెప్ట్‌ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన సుందరకాండ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News