మృణాల్ ను వాడుకుంటారా? సైడ్ చేస్తారా?
కొన్ని సినిమాల్లో కథ కంటే క్యాస్టింగ్ మరింత ఇంట్రెస్ట్ ను కలిగిస్తోంది. బాలీవుడ్ సీక్వెల్స్ అయితే క్యాస్టింగ్ విషయంలో చాలా మిస్టరీగా ఉంటాయి.;
కొన్ని సినిమాల్లో కథ కంటే క్యాస్టింగ్ మరింత ఇంట్రెస్ట్ ను కలిగిస్తోంది. బాలీవుడ్ సీక్వెల్స్ అయితే క్యాస్టింగ్ విషయంలో చాలా మిస్టరీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ బాలీవుడ్ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఆసక్తిని కలిగిస్తోంది. జులై లో రిలీజ్ కానున్న సన్ ఆఫ్ సర్దార్2 క్యాస్టింగ్ ఇప్పుడు అందరిలోనూ ఇంట్రెస్ట్ ను పెంచుతోంది.
దానికి కారణం ఈ సినిమాతో పంజాబీ స్టార్ నటి నీరూ బజ్వా బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఈ సినిమా సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ ఆఫ్ సర్దార్ సినిమా రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన మర్యాద రామన్నకు రీమేక్ గా తెరకెక్కి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా మంచి కథతో ఆడియన్స్ ను మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే సన్ ఆఫ్ సర్దార్2 సినిమాలో అజయ్ దేవగణ్ భార్యగా నీరూ బజ్వా నటిస్తోందని వార్తలు జోరుగా వినిపిస్తన్నాయి. పంజాబీ సినీ ఇండస్ట్రీలో నీరూ బజ్వాకు మంచి ఆదరణ ఉంది. ఆ జనాదరణ సన్ ఆఫ్ సర్దార్ ఫ్రాంచైజ్ కు కొత్త ఆడియన్స్ ను తీసుకొస్తుందని, ఈ సినిమాలో నీరూ బజ్వా క్యారెక్టర్ చాలా గణనీయంగా ఉంటుందని అంటున్నారు.
నీరూ అజయ్ దేవగణ్ భార్య పాత్రలో నటిస్తుంటే మరి మృణాల్ ఠాకూర్ ఏ పాత్రలో కనిపించనుందని ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుని స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్న మృణాల్ కు కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు మృణాల్ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ అమ్మడికి ఇంకా చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దక్కలేదు.
దీంతో అజయ్ దేవగణ్ తో చేస్తున్న సన్ ఆఫ్ సర్దార్2 ఆమెకు బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇస్తోందని అందరూ భావిస్తున్న టైమ్ లో సడన్ గా అజయ్ దేవగణ్ భార్య పాత్రలో నీరూ నటిస్తుందని అంటున్నారు. అజయ్ దేవగణ్ కు భార్యగా నీరూ నటిస్తే మరి మృణాల్ అతని ప్రేయసి పాత్రలో కనిపిస్తుందా లేక మృణాల్ కు అంతకు మించిన క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారా? అదీ లేదంటే మంచి టాలెంట్ ఉన్న మృణాల్ ను కేవలం గ్లామర్ రోల్ కు పరిమితం చేశారా అనేది తెలియాల్సి ఉంది.