'మేమ్ ఫేమస్'.. హీరోగా అనుకోకుండా చేశా

టాలీవుడ్‌ లో కొత్త తరహా కథలతో గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది;

Update: 2026-05-06 22:30 GMT

టాలీవుడ్‌ లో కొత్త తరహా కథలతో గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన హీరోగా, దర్శకుడిగా పరిచయమైన మేమ్ ఫేమస్ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం నిజానికి ముందుగా ప్లాన్ చేసింది కాదట. అనుకోకుండా హీరోగా మారాల్సి వచ్చిందని ఆయన తాజాగా స్వయంగా వెల్లడించారు.

సుమంత్ ప్రభాస్.. ఇప్పుడు గోదారి గట్టుపైన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌‌ బ్యానర్‌‌‌‌ పై అభినవ్ నిర్మించారు. మే 8న ఆ సినిమా విడుదల కానుండగా ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ మూవీ గురించి మాట్లాడారు.

'మేమ్ ఫేమస్ సినిమాలో నేను యాక్సిడెంటల్ యాక్టర్' అని ఆయన చెప్పడం గమనార్హం. ఆ సినిమాకు సరైన హీరో కోసం దాదాపు ఆరు నెలల పాటు కొత్త వాళ్లను ట్రై చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్యూర్ తెలంగాణ వైబ్ మాట్లాడే వాళ్ల కోసం, హెవీ బాడీ లాంగ్వేజ్ ఉండే నటుడిని వెతికినా దొరకలేదని చెప్పారు. ముగ్గురు ముఖ్య పాత్రల్లో ఒకరు హైలెట్‌ గా కనిపించాల్సిన అవసరం ఉండటంతో ఆ పాత్రకు సరైన ఎంపిక కోసం టీమ్ చాలా సమయం తీసుకుందని వెల్లడించారు.

అయితే, అంత కాలం వెతికినా ఫలితం రాకపోవడంతో చివరికి ఆ పాత్రను తానే చేయాలని సుమంత్ నిర్ణయించుకున్నారు. 'మనమే ఆ ఏజ్ గ్రూప్ కదా.. మనం ట్రై చేద్దాం' అనిపించి ఆ రోల్‌ ను తీసుకున్నానని తెలిపారు. మొదట్లో ఆ నిర్ణయంపై టీమ్‌ లో కొంత సందేహం కూడా వ్యక్తమైందట. దర్శకుడిగా బాధ్యతలు తీసుకుంటూనే హీరోగా నటించడం ఒత్తిడిగా మారుతుందని చాలామంది హెచ్చరించినట్లు చెప్పారు.

అయినా సరే, సుమంత్ వెనక్కి తగ్గలేదు. కొత్త వాళ్లకు నేర్పించడానికి యూట్యూబ్ వీడియోలు చూస్తూ, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో నేర్చుకున్నట్లు వివరించారు. ఒక దర్శకుడిగా హీరోకు చెప్పాల్సిన సూచనలను తానే అర్థం చేసుకుని, కెమెరా ముందు అదే విధంగా చేస్తే డైరెక్టరే హీరో అవుతారని తెలిపారు. అయితే ఆ ప్రయోగం చివరికి ఫలించింది. మేమ్ ఫేమస్ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, యూత్‌ ను బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ, నేచురల్ డైలాగ్స్, కొత్త నటీనటుల యాక్టింగ్ సినిమాకు ప్లస్‌ గా మారాయి. సుమంత్ నటన, రచన కూడా మెయిన్ అసెట్ గా నిలిచాయి. మొత్తంగా చూస్తే, సుమంత్ ప్రభాస్ తీసుకున్న ఆ అనుకోని నిర్ణయం ఆయన కెరీర్‌ ను మలిచిన కీలక మలుపుగా మారింది. హీరోగా చేయాలని ప్లాన్ లేకపోయినా, పరిస్థితులు కలిసి వచ్చి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ధైర్యంతో కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి అప్ కమింగ్ మూవీస్ తో సుమంత్ ప్రభాస్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News