• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుమంత్ 'అనగనగా'.. టీజర్...

సుమంత్ 'అనగనగా'.. టీజర్ ఎలా ఉందంటే?

| సుమంత్ తోపాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-02-22 17:43 GMT

టాలీవుడ్ నటుడు సుమంత్.. ఒకప్పుడు హీరోగా అనేక మంచి సినిమాలను ఆడియన్స్ కు అందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు త్వరలో లీడ్ రోల్ లో అనగనగా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఆ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.

సుమంత్ తోపాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. రాకేష్ రెడ్డి, రుద్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. ఉగాది కానుకగా మార్చి 30వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నారు.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. టీజర్ ను తీసుకొచ్చారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తో శనివారం విడుదల చేసి గ్లింప్స్ ను రిలీజ్ చేయించారు. ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. కథ అంటే ఏంటి అవి ఎందుకు అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. సినిమాలో సుమంత్‌ టీచర్ గా కనిపించనున్నారు.

ఆయన బట్టి పట్టించుకుండా, ప్రెజర్ పెట్టకుండా విద్యను నేర్పిద్దామనుకుంటారు.

కానీ ఆయన భావాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకుంటారు. దీంతో ఒంటరిగా పోరాడుతూ కనిపిస్తారు. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. ఇప్పుడు టీజర్.. అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి.. చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే, అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలుగు భాషా ప్రాముఖ్యతను,ఓ ఎమోషనల్ కంటెంట్ చెప్పబోతున్నట్లు కూడా ఉందని అంటున్నారు.

'పిల్లలకు బట్టి పట్టిస్తే చదువెలా వస్తుంది?', 'నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేది ఏంటి?' అంటూ సుమంత్ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తున్నారు. పొడుపు కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నేచరుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సుమంత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. ఓవరాల్ గా టీజర్.. చాలా బాగుందని చెప్పాలి. అదే సమయంలో మూవీపై మంచి అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి.

Full View
Tags:    
  • Anaganaga 
  • Sumanth 
  • KajalChoudhary 
  • AvasaralaSrinivas 
  • MasterViharsh 
  • ETVWin 
  • EducationSystem 
  • EmotionalDrama 
  • OTTRelease 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS