ఆల్ట్రా స్టైలిష్ స్టార్ గా చరణ్!
ఓ క్లాస్ కంటెంట్ తర్వాత మాస్ కంటెంట్ తో సినిమా తీయడం సుకుమార్ కి తొలి నుంచి ఉన్న అల వాటే.;
కథ, పాత్రకు తగ్గట్టు పర్పెక్ట్ లుక్ లో హీరోని ఎలివేట్ చేయగల దర్శకుడు సుకుమార్. అది స్టైలిష్ లుక్ అయినా? మాస్ లుక్ అయినా? వాటిలో కొత్తదనం ట్రై చేయడం సుక్కు స్పెషాల్టీ. టాలీవుడ్ లో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా? ఈ విషయంలో సుక్కు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. `ఆర్య 2`లో బన్నీ, `100 పర్సంట్ లవ్` లో నాగచైతన్య, `వన్` లో మహేష్, `నాన్నకు ప్రేమతో` లో ఎన్టీఆర్ లుక్ పరంగా ఓ రేంజ్ లో హైలైట్ అయ్యారు. కంటెంట్ కు తగ్గట్టు క్లాసిక్ పాత్రల్లో హీరోల్ని ఎలివేట్ చేసారు.
మాస్ కి భిన్నంగా:
ఓ క్లాస్ కంటెంట్ తర్వాత మాస్ కంటెంట్ తో సినిమా తీయడం సుకుమార్ కి తొలి నుంచి ఉన్న అల వాటే. `పుష్ప` తో బన్నీని ఏ రేంజ్ మాస్ లుక్ లో దించాడో తెలిసిందే. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో పర్పెక్ట్ గా లాంచ్ చేసాడు. పాత్రకు తగ్గట్టు పర్పెక్ట్ గెటప్ తో హీరోని పీక్స్ కు తీసుకెళ్లడం ఆయనకే చెల్లింది. మరి తదుపరి రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుంది? అంటే చరణ్ కోసం ఓ ఆల్ట్రా స్టైలిష్ లుక్ డిజైన్ చేసినట్లు లీకైంది. ఇదోక క్లాసిక్ స్టోరీ అని తెలిసింది.
చరణ్ న్యూ లుక్ లో:
`రంగస్థలం`లో చరణ్ ని ఎంత మాస్ గా చూపించాడో? ఆర్సీ 17 లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఓ క్లాస్ రోల్ లో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో ఇంత వరకూ స్టైలిష్ లుక్ లో కనిపిం చింది కొన్ని చిత్రాల్లోనే. `ఆరేంజ్`, ` గోవిందుడు అందరివాడేలే`, `బ్రూస్లీ`, ` ధృవ` లాంటి చిత్రాల్లో చరణ్ లుక్ స్టైలిష్ గా ఉంటుంది. కానీ సుకుమార్ మాత్రం ఇంత వరకూ చరణ్ తో ఆ తరహా ప్రయత్నం చేయ లేదు. ఈ నేపథ్యంలోనే కంటెంట్ ఆధారంగా చరణ్ లుక్ ఆల్ట్రా స్టైలిస్ గా ఉంటుందని తెలిసింది.
చరణ్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్:
`రంగస్థలం`, `పుష్ప` లాంటి మాస్ రోల్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఈ కథ సిద్దం చేసారని సుక్కు సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. తొలుత ఈ కాంబినేషన్ లో మరో సినిమా ప్రకటించగానే `రంగస్థలం 2` అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇద్దరి కలయికలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కావడంతోనే సుకుమార్ మళ్లీ అదే ఛాన్స్ తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆర్సీ 17 అందుకు భిన్నమైన సినిమాగా తెలుస్తోంది. ఆర్సీ 16 `పెద్ది` కూడా మాస్ కంటెంట్ కం రోల్ తో వస్తోన్న నేపథ్యంలో ఆర్సీ 17 ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ చిత్రమే అవుతుంది.