సుకుమార్ సంగీత దర్శకుడిని మార్చేస్తున్నారా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం (RC17)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం (RC17)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడి ఎంపిక విషయంలో ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ తన ప్రతి సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తోనే పనిచేసారు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ పరంగా సంచలన విజయాలు సాధించాయి. కానీ ఈసారి మాత్రం ఈ లెక్క మారుతుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
సుకుమార్ కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందించారు. `ఆర్య` నుంచి మొన్నటి `పుష్ప` వరకు ఈ కాంబో మ్యూజిక్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. సుకుమార్ ఆలోచనలకు, అభిరుచికి తగ్గట్టుగా ట్యూన్స్ ఇవ్వడంలో డీఎస్పీ ఎప్పుడూ ముందుంటారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే సుకుమార్ తన సినిమాల్లో మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను ఎప్పుడూ వేరే వారికి అప్పగించలేదు. అలాంటిది ఇప్పుడు తొలిసారిగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కాకుండా కొత్త పేర్లు వినిపించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
రామ్ చరణ్ 17వ సినిమా కోసం సంగీత దర్శకుడి కొంతమంది యువ మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ట్రెండింగ్ మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యంకర్ మరియు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో తన ప్రత్యేకమైన బాణీలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిని సుకుమార్ ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా కొత్త తరహా గ్లోబల్ మ్యూజిక్ అందించేందుకే ఈ మార్పు జరగనుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే సుకుమార్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సినిమాల్లో వైవిధ్యాన్ని కోరుకుంటున్న సుకుమార్ ఈసారి మూస పద్ధతికి భిన్నంగా కొత్త సౌండింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. కథ డిమాండ్ మేరకు సరికొత్త మ్యూజికల్ ఫ్లేవర్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్‌తో ఉన్న స్నేహం వేరు. సినిమా ప్రయోజనాలు వేరు అనే కోణంలో సుకుమార్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో వేరే సంగీత దర్శకుడిని ఎంచుకుంటున్నారనే వార్తలు బయటికి రావడంపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సుకుమార్-డీఎస్పీ కాంబో మ్యాజిక్‌ను మిస్ అవుతామేమోనని కొందరు ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే.. కొత్త దర్శకులతో సుకుమార్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలని మరికొందరు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మొత్తానికి రామ్ చరణ్ సినిమాతో సుకుమార్ తన ప్రయాణంలో ఓ పెద్ద బ్రేక్ తీసుకునేలా కనిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ కాకుండా సాయి అభ్యంకర్ లేదా జిబ్రాన్ లాంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తే మాత్రం అది టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఫైనల్‌గా మ్యూజిక్ అందించేది ఎవారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.