ఆత్రేయ.. ఇదే క్లారిటీ కంటిన్యూ చేస్తే..

ఒక సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు.. దర్శకుడు చెప్పాలనుకున్న స్టోరీ.. ఆ రెండింటి మధ్య తేడా వచ్చినప్పుడు సినిమా చూసే ఎక్స్పీరియన్స్ కూడా మారుతుంది.

Update: 2026-10-11 08:44 GMT

ఒక సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు.. దర్శకుడు చెప్పాలనుకున్న స్టోరీ.. ఆ రెండింటి మధ్య తేడా వచ్చినప్పుడు సినిమా చూసే ఎక్స్పీరియన్స్ కూడా మారుతుంది. స్టోరీలో కొత్తదనం చూపించే దర్శకులకు ఆ విషయం మరింత మెయిన్. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన నెక్స్ట్ మూవీ తులాభారం విషయంలో దానిపైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.

రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సినిమానే తులాభారం. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ వీడియోలో సినిమా పేరును ఫిక్స్ చేసే విధానాన్ని చూపించారు. రవితేజతో పాటు ప్రియాంక అరుళ్ మోహన్, అనశ్వర రాజన్, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ తదితరులు ఇందులో కనిపించారు. స్టోరీకి ఏ టైటిల్ పెట్టాలనే చర్చతో మొదలైన వీడియో చివరకు తులాభారం టైటిల్‌ ను పరిచయం చేసింది. ముందే బయటకు వచ్చిన టైటిల్‌ ను కూడా సరదాగా ప్రస్తావిస్తూ ప్రమోట్ చేశారు

అయితే ఆ వీడియో ద్వారా తులాభారం విషయంలో ఆయన ఎందుకు ముందుగానే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారో అర్థమవుతుంది. అంటే సుందరానికీ సినిమా నుంచి ప్రేక్షకులు కామెడీని ఆశిస్తే.. అందులో డ్రామా ఎక్కువగా ఉందనే అభిప్రాయం కొందరిలో ఏర్పడింది. సరిపోదా శనివారం మూవీని కూడా కొందరు సూపర్ హీరో స్టోరీ అంచనా వేశారు. అంటే, సినిమా ప్రమోషన్స్ లేదా హీరోను బట్టి ప్రేక్షకులు కథను ఊహించుకోవడం సహజం.

కానీ దర్శకుడు ఎంచుకున్న కథనం అందుకు భిన్నంగా ఉంటే అంచనాలు మారిపోతాయి. వివేక్ ఆత్రేయ కెరీర్ ను అబ్జర్వ్ చేస్తే.. ఆయన ఒకేలాంటి కథలకు పరిమితం కాలేదని తెలుస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంటే సుందరానికిలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారు. సరిపోదా శనివారంలో యాక్షన్‌ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి సినిమాలోనూ కథను చెప్పే విధానాన్ని మార్చే ప్రయత్నం చేశారు.

అయితే కథలోని కొత్తదనం ప్రేక్షకులకు చేరాలంటే.. ఆ సినిమా నుంచి ఏం ఆశించాలో కూడా వారికి కొంత అవగాహన ఉండాలి. ఇదే ఇప్పుడు తులాభారం విషయంలో మెయిన్ గా మారింది. సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని ముందుగానే చెప్పడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను సరైన రేంజ్ లో తీసుకెళ్లవచ్చు. అప్పుడు సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

అందుకే ఈసారి టైటిల్ ప్రకటించే వీడియోలోనే సినిమా కోసం కొన్ని విషయాలు క్లియర్ గా చెప్పినట్లే. అందులో క్రైమ్, కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు పొలిటికల్ ఎలిమెంట్స్ కనిపించాయి. రవితేజను క్రైమ్ మహారాజాగా పరిచయం చేయడం కూడా ఇంట్రెస్ట్ పెంచింది. అయితే అవన్నీ స్టోరీలో ఎలా మిక్స్ చేస్తారు, ఏ ఎలిమెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. టైటిల్ వీడియో ఆధారంగా కథను అంచనా వేయలేం.

రవితేజ మాస్ ఇమేజ్‌, ఆత్రేయ స్టోరీ టెల్లింగ్ సరిగ్గా మిక్స్ అవ్వడమే ఆ సినిమాకు ముఖ్యం. కొత్త కథను ఎంచుకోవడంతో పాటు దాన్ని ప్రేక్షకులకు క్లియర్ గా పరిచయం చేయగలిగితే సినిమాపై హైప్ మరింత పెరుగుతుంది. తులాభారం విషయంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ క్లారిటీని ప్రమోషన్స్ తోపాటు కథలో కంటిన్యూ చేస్తే.. ఆత్రేయ తన కొత్త ప్రయత్నంతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించే అవకాశం ఉంది.

Tags:    

Similar News