బాలయ్య లైనప్ లోకి చేరిన మరో ఇద్దరు దర్శకులు...
నందమూరి నటసింహం బాలయ్య బాబు వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ లను అందుకున్నాడు. ప్రేక్షకులకు నచ్చే కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు
నందమూరి నటసింహం బాలయ్య బాబు వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ లను అందుకున్నాడు. ప్రేక్షకులకు నచ్చే కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. 70 సంవత్సరాలకు దగ్గరవుతున్నప్పటికీ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ తన కంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం... ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
బాలయ్య లైనప్ లో కమర్షియల్ డైరెక్టర్స్...
ఒక పక్క బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ లను చేస్తూనే మరో ఇద్దరు కమర్షియల్ డైరెక్టర్స్ ను తన లైనప్ లోకి చేర్చుకున్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు కాగా, మరొకరు హరీష్ శంకర్ కావడం విశేషం... వీళ్లిద్దరు బాలయ్య బాబుకి కథనైతే వినిపించారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో 'జనవరి 12 విడుదల' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తర్వాత బాలయ్య బాబు తో అనిల్ జతకట్టబోతున్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 'గబ్బర్ సింగ్' ఫేమ్ హరీష్ శంకర్ ప్రస్తుతం అంతమంచి ఫామ్ లో లేడు. ఈ ఇయర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయన ప్రస్తుతం కథను రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా బాలయ్య బాబుకి ఒక లైన్ కూడా వినిపించాడు. తన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరు కమర్షియల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్నారు. కాబట్టి వీళ్ళు బాలయ్య ని మరింత ఎఫెక్టువ్ గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది...
ఇండస్ట్రీ షేక్ అవుతుందా?
బోయపాటి శ్రీను తో చేసిన 'అఖండ 2' సినిమా అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. దాంతో రాబోయే సినిమాల మీద బాలయ్య చాలావరకు స్పెషల్ కేర్ తీసుకొని తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక ముందు చేయబోయే సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ సినిమాలు గా నిలవాలి. ఫెయిల్యూర్ గా మారొద్దని కథల విషయంలో క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో వీళ్ల నుంచి వచ్చే సినిమాలతో బాలయ్య ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తాడా? సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్ కి చేరుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది...