సరైన సమయంలో మెగాస్టార్ ఆపన్న హస్తం.. కల్యాణ్ సేఫ్!
సరైన సమయంలో సరైన సహకారం అందకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్లతో నిర్మించే సినిమాలు రిలీజ్ కి నోచుకోని దుస్థితిలో సెన్సార్ ముంగిట నానా యాతనలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
సరైన సమయంలో సరైన సహకారం అందకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్లతో నిర్మించే సినిమాలు రిలీజ్ కి నోచుకోని దుస్థితిలో సెన్సార్ ముంగిట నానా యాతనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక సాయం మెగాస్టార్ చిరంజీవి నుంచి అందడం వల్లనే తమ సినిమా `కామ్రేడ్ కల్యాణ్` సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడి విడుదలైందని వెల్లడించారు స్టార్ రైటర్ కం నిర్మాత కోన వెంకట్. ఒక కామెడీ సినిమాకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారని చిరు సెన్సార్ వారిని అడిగారట. దీంతో అట్నుంచి లైన్ క్లియరైందని తెలుస్తోంది.
అయితే సెన్సార్ నుంచి బయటపడటం అటుంచితే.. చిరంజీవిపైనే ఈ సినిమాలో సెటైర్లు వేసారట. చిరు నటించిన `ఆచార్య` చిత్రంపై పంచ్ లు ఉన్నాయట. కానీ దానిని కూడా చిరు ఎంతో లైట్ తీసుకుని దానివల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని చిత్రబృందాన్ని గో అహెడ్ అన్నారట. ఆసక్తికరంగా `ఆచార్య` చిత్రంలో నక్సలిజం నేపథ్యం ఉంది. కొరియర్ కల్యాణ్ చిత్రంలోను నక్సలిజం నేపథ్యం ఉంది. బహుశా అందుకే ఈ పంచ్ వర్కవుటైంది. చిరు సాయం గురించి నెమ్మదిగా రివీల్ చేసానని సమయం వచ్చినప్పుడే చెబుతున్నానని కోన కొంత ఎమోషనల్ అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు. కష్ట కాలంలో ఆపన్న హస్తం ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
చిత్ర పరిశ్రమలో చాలామంది పెద్ద స్టార్లకు ఇలాంటి మంచి మనసు ఉందో లేదో తెలీదు కానీ... చిరంజీవి యూనిక్ క్వాలిటీస్ గురించి మాట్లాడటానికి ఇది ఒక్కటే కాదు.. ఇంకా ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన గుప్తదానాలు చేసిన రోజులలో వాటి గురించి అంతగా ప్రచారం లేదు. ఆ సమయంలో మీడియా మెగాస్టార్ పైనా మెగా కుటుంబంపైనా ఎలాంటి బురద జల్లిందో అందరికీ తెలుసు. కేవలం చిరంజీవి ఒక్కరే కాదు పరిశ్రమలో చాలామంది స్టార్లు తాము చేసిన గుప్త దానాల గురించి అంతగా ప్రచారం కోరుకోరు. అయితే ఫలానా హీరో ప్రజల కోసం ఏమీ చేయరు అని సింపుల్ గా విమర్శించడం కొత్తేమీ కాదు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాల రిలీజ్ లకు సహకారం అందించడం.. ఏవైనా ఇబ్బందులు ఉంటే పెద్దన్నలా ఆపన్నహస్తం అందించడం.. ఆర్థిక కష్టాలలో ఉన్న ఆర్టిస్టులకు సాయం అందించడం.. ఒకటేమిటి వీటన్నిటినీ వారేమీ ప్రచారాన్ని కోరుకోవడం లేదు. కొన్నిసార్లు సమయానుకూలంగా చేయాల్సిన సాయం మెగా ఫ్యామిలీ నుంచి అందుతూనే ఉంది. దాసరి లాగా టాలీవుడ్ పెద్ద ట్యాగ్ అవసరం లేదు.. ఏ సాయానికైనా అవసరాన్ని బట్టి ముందుకొస్తానని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి దానిని ఆచరణలో చూపిస్తున్నారు.
కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు.. ఆయన స్ఫూర్తితో ఆ కుటుంబంలో ఉన్న అరడజను మంది హీరోలు ఇదే బాటలో నడుస్తున్నారు. కేవలం ఒక్క మెగా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక... ఇలా ప్రతి ఒక్కరూ దానధర్మాలలో ఆపన్న హస్తం అందించడంలో ముందున్నారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నారు. అయితే దీనికి వారు తగిన ప్రతిఫలం లేదా గుర్తింపు కంటే అభిమానం సంపాదించుకోవడం అనే ఆలోచన తప్ప వేరొకటి కాదు. చిరు సాయంతో రిలీజ్ బరిలోకి వచ్చిన కామ్రేడ్ కల్యాణ్ కి ఇకపై మెగా బ్లెస్సింగ్స్ బాక్సాఫీస్ వద్ద కూడా కలిసి వస్తాయనడంలో సందేహం లేదు.