బిగ్ బాస్‌లో ఇదేం షాక్ బాసూ.. ఒకరికి రెండోసారి ఎలిమినేషన్!

బిగ్ బాస్ ఎలిమినేషన్ అంటేనే ఆ రోజు ఎంత టెన్షన్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

Update: 2026-10-11 04:11 GMT

బిగ్ బాస్ ఎలిమినేషన్ అంటేనే ఆ రోజు ఎంత టెన్షన్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చివరి వరకు ఎవరు హౌస్‌లో ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారు.. అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఎక్కువగానే ఉంటుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఈ వారం మాత్రం ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఒకరు కాదు ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక దీంతో అపూర్వతో పాటు చరణ్ కూడా ఎలిమినేట్ కావడం ఆసక్తిని తీసుకొస్తుంది.

ఈసారి బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈసారి మొత్తం పైన పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లలో నిలిచారు. రోహిత్, త్రిగుణ్, అమన్, నరేష్, అపూర్వ, ఝాన్సీ, రామ్ ప్రసాద్, శాలిని, చరణ్, ముఖేష్ నామినేషన్లలో ఉన్నారు.

అయితే కెప్టెన్‌గా ఉన్న వర్షిణితో పాటు టెంపర్ వంశీ, సుధీర్ ఇమ్యూనిటీ పొందడంతో నామినేషన్ల నుంచి తప్పించుకునే అవకాశం దక్కింది. మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కంటెస్టెంట్స్ తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ టాస్కుల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా కొంతమంది సేఫ్ అయ్యారు.

త్రిగుణ్, అమన్, రామ్ ప్రసాద్ టాస్కుల ద్వారా నామినేషన్ల నుంచి బయటపడ్డారు. తనకు ఉన్న ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకుని సింగర్ ఝాన్సీ కూడా సేఫ్ అయ్యారు. ఓటింగ్‌లో మంచి స్థానం సంపాదించిన రోహిత్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చివరికి అపూర్వ, చరణ్, శాలిని డేంజర్ జోన్‌లో నిలిచి ఉన్నారు.

ముఖ్యంగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌కు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించారు. చివరికి తక్కువ ఓట్లు రావడంతో అపూర్వ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మూడో వారంలో హౌస్‌లోకి వచ్చిన అపూర్వకు ఈసారి ప్రేక్షకుల నుంచి తగినంత మద్దతు పెద్దగా లభించలేదు.

హౌస్‌లో కొంత స్క్రీన్ స్పేస్ దక్కినా టాస్కుల్లో తన ఆటను బలంగా చూపించలేక పోయింది. ఈ వారం ఇతర కంటెస్టెంట్స్‌తో జరిగిన గొడవలు కూడా ఆమె ఆటపై ప్రభావం చూపినట్లు కనిపించింది. దీంతో అపూర్వ ప్రయాణం ముగిసింది.

అపూర్వ ఎలిమినేషన్ తర్వాత శాలిని, చరణ్ మధ్య ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని కాపాడాలనే నిర్ణయాన్ని హౌస్‌లోకి వచ్చిన కొత్త వైల్డ్ కార్డ్స్‌కు అప్పగించారు. వారి దగ్గర ఉన్న సేవ్ కార్డును ఎవరికి ఇవ్వాలనే విషయంలో చర్చించి చివరికి శాలినిని కాపాడారు.

దీంతో చరణ్ మహదేవ్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే చరణ్‌కు ఇది రెండో ఎలిమినేషన్ కావడం విశేషం. సీజన్ మొదటి వారంలోనే బయటకు వచ్చిన అతను ప్రేక్షకుల ఓట్లతో తిరిగి వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి వచ్చాడు. కానీ ఈసారి కూడా తన ఆటతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు.

మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ముందు వారాల్లో ఎవరు బలంగా ఆడతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే వివరాలన్నిటిని ఒకసారి చూడాలి.

Tags:    

Similar News