రియా చ‌క్ర‌వ‌ర్తికి సినిమాల్లో ఛాన్సుల్లేక‌పోయినా కానీ..!

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యారు.

Update: 2026-10-11 06:03 GMT

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ వంటి పరిణామాలు జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి.

అన్ని వివాదాలు, కేసుల నుంచి ఆమె చట్టపరంగా నిర్దోషిగా బయటపడినా సినీ పరిశ్రమలోని ప్రముఖులు- నిర్మాతలు ఇప్పటికీ ఆమెను దూరం పెట్టడం గమనార్హం. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ హీరో రియా చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని మాటిచ్చినా ఇప్ప‌టికీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి స‌మాచారం రాలేదు. అయినప్పటికీ ఎలాంటి నిరాశకు లోనుకాకుండా.. రియా మొక్కవోని ధీక్షతో తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా వేదికగా మోడలింగ్ రంగంలో రాణిస్తూ రియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ - సోషల్ మీడియా ద్వారా రియా చ‌క్ర‌వ‌ర్తి నిలకడగా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ప్రముఖ రియాలిటీ టీవీ షోలలో పాల్గొంటూ రియా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించారు. ఓటీటీ- టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటూ, తనకంటూ కొత్త ఉపాధి మార్గాలను ఏర్పరచుకుంటున్నారు.

ప్రముఖ బ్రాండ్ `స్టేజ్ బ్యూటీ` భాగస్వామ్యంతో.. అలాగే తన సొంత క్రీమ్ `బ్లష్ క్యాచ్ బ్లషిన్` లాంచ్ చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్- టీవీ షోల ద్వారా నెలకు, సంవత్సరానికి భారీ మొత్తంలో ఆర్జిస్తూ వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తున్నారు.

స్టేజ్ బ్యూటీ- క్రీమ్ బ్లష్ ప్రమోషన్ కాంట్రాక్ట్:

రియా చక్రవర్తి `స్టేజ్ బ్యూటీ` బ్రాండ్‌తో కలిసి తన సరికొత్త క్రీమ్ బ్లష్ `క్యాచ్ బ్లషిన్` లాంచ్ చేస్తోంది. ఈ తరహా ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ - లాంచ్ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు లేదా బ్రాండ్ స్థాయిని బట్టి అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చని అంచనా.

ఇన్‌స్టాగ్రామ్ & ఎక్స్ పోస్టుల ద్వారా ఆదాయం:

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు కలిగిన రియా చక్రవర్తి, సోషల్ మీడియాలో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ చేయడానికి మంచి మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. త‌న‌ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నెలకు సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, ఏడాదికి ఇది భారీ మొత్తంలో ఉంటోంది.

Tags:    

Similar News