ఆ రెండు విజ‌యాలు దేవ‌ర‌కొండ‌కి కీల‌క‌మైన‌వే!

హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో `గీత గోవిందం` సంచలన విజయం సాధించిన‌ సంగతి తెలిసిందే.

Update: 2026-10-11 08:44 GMT

హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో `గీత గోవిందం` సంచలన విజయం సాధించిన‌ సంగతి తెలిసిందే. ఆ సినిమాతో విజ‌య్ యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ హీరోల సరసన నిలిచారు. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు సినిమాలు యావరేజ్ రిజల్ట్స్ సాధించగా.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో విజయ్ కెరీర్ పరంగా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోతున్న `రణబలి`, `రౌడీ జనార్ధన్` సినిమాలు విజయ్ దేవరకొండ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారాయి.

రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `రణబలి` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేయని సరికొత్త గెటప్‌లోశక్తివంతమైన యోధుడిగా కనిపించబో తున్నారు. గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయి మాస్ ప్రభంజనం సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కథాంశం యూనిక్‌గా ఉండటంతో పాటు, విజయ్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రౌడీ జనార్ధన్` సినిమా కూడా విజయ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇది పూర్తిగా పక్కా మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విజయ్ మాస్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంద‌ని ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రౌడీ ఇమేజ్‌కు తగినట్లుగా పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో విజయ్ మార్కెట్ స్థాయి మళ్లీ శిఖరాగ్రానికి చేరుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుస పరాజయాలు లేదా ఆశించిన ఫలితాలు రాని సమయంలో ఇలాంటి వైవిధ్యమైన, భారీ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం విజ‌య్ లోని నటుడి పరిణతికి నిదర్శనం. ఒకవైపు పీరియాడిక్ కథాంశంతో `రణబలి` రూపంలో ప్రయోగానికి సిద్ధమవుతూనే.. మరోవైపు `రౌడీ జనార్ధన్` ద్వారా పక్కా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడం వ్యూహాత్మక అడుగుగా చెప్పొచ్చు.

`గీత గోవిందం` తర్వాత సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ రెండు చిత్రాలు మంచి కంబ్యాక్ ఇస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. అలాగే విజయ్ కెరీర్ గ్రాఫ్‌ను మెరుగు ప‌ర‌చ‌డ‌మే కాకుండా .. తెలుగులో విజ‌య్ స్టామినా మరోసారి నిరూపించడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాల సక్సెస్ విజయ్ మార్కెట్‌ను పాన్-ఇండియా స్థాయిలో బలపరిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News