దర్శకులకు డెడ్ లైన్ పెడుతున్న స్టార్ హీరోలు...
స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేస్తున్నారు. ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకొని తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేస్తున్నారు. ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకొని తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్లను ఎంచుకోవడంలో బిజీ అవుతున్నారు. కొంతమంది హీరోలు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టేసారు... వాళ్లు పూర్తి స్క్రిప్ట్ తో మెప్పిస్తే సరి లేకపోతే వాళ్ళను పక్కన పెట్టి మరో దర్శకుడితో వెళ్ళిపోతున్నారు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో 'రాకా ' మూవీ చేస్తూన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా లోకేష్ కనకరాజు సినిమా ఆగిపోయింది అంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నప్పటికి అందులో వాస్తవం లేదని సినిమా యూనిట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ లోకేష్ కనకరాజుకి ఒక డెడ్ లైన్ పెట్టారట. నెల రోజుల్లోపు అతనికి బౌండెడ్ స్క్రిప్ట్ చెబితేనే ఆయన ఆ సినిమాని కంటిన్యూ చేస్తాడని లేకపోతే సినిమాని ఆపేసే అవకాశం కూడా ఉండొచ్చని అర్జున్ టీం మాట్లాడుతున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి... రాకా సినిమా చివరి దశకు చేరుకుంది. తదుపరి సినిమా మీద ఫోకస్ చేయకపోతే అల్లు అర్జున్ కెరియర్ కి ఇబ్బంది అవ్వచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. లోకేష్ కనకరాజు బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురాకపోతే నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ కి డేట్స్ ఇచ్చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. లోకేష్ ఈ మూవీ మీద ఎంతవరకు క్లారిటీతో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి అతనికి డెడ్ లైన్ అయితే పెట్టాడట..
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో 'కాకా' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక సినిమా చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి శ్రీకాంత్ తో కాకుండా మరో కమర్షియల్ సినిమాను చేసిన తర్వాత శ్రీకాంత్ కి అవకాశాన్ని ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికోసమే ఆయన రీసెంట్ గా కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలను కూడా వింటున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో వార్తలైతే చెక్కర్లు కొడుతున్నాయి. బ్యాక్ ఎండ్ లో స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నప్పటికీ చిరంజీవి తొందర్లోనే తన నెక్స్ట్ మూవీ కూడా క్లారిటీ ఇస్తాడట.
లైన్ ఒకే చేయించుకున్న కొంతమంది డైరెక్టర్లలో ఏ దర్శకుడు ముందుగా బౌండెడ్ స్క్రిప్ట్ తో తనను ఇంప్రెస్ చేస్తాడో వాళ్ళకి డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఎందుకంటే సంక్రాంతికి 'కాకా' సినిమా రిలీజ్ అవుతోంది. కాబట్టి ఫిబ్రవరిలో మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా ఆ సినిమాని ఫినిష్ చేయాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను ఎక్కడా కూడా లేట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్రేక్షకులను, అభిమానులను ఆనందపరచడం ఒక్కటే తన టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు... లైన్ ఓకే చేయించుకున్న దర్శకులకు స్టార్ హీరోలు డెడ్ లైన్ పెట్టి వాళ్ళను చాలా తొందరగా పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు...