ఆంధ్రావాలా మ్యాడ్ నెస్ లో సుజిత్
యంగ్ డైరెక్టర్ సుజిత్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా తెరకెక్కించారు. ఆయితే ఆయన వ్యక్తిగతంగా పవన్ కు వీరాభిమాని.;
ఒక హీరో అభిమాని ఇంకో హీరోకు హైప్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే ఆ అభిమాని కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అయితే? ఇంకేం ఉంటుంది ఫ్యాన్స్ ఫుల్ వైబ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఓజీ డైరెక్టర్ సుజిత్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?
యంగ్ డైరెక్టర్ సుజిత్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా తెరకెక్కించారు. ఆయితే ఆయన వ్యక్తిగతంగా పవన్ కు వీరాభిమాని. జానీ సినిమా రోజుల్లోనే పవర్ స్టార్ కు పెద్ద అభిమాని అయిపోయారు. అప్పట్నుంచి ఆయనను ఫాలో అవుతున్నారు. ఇక డైరెక్టర్ అయ్యక తన అభిమాన హీరోతోనే సినిమా తీసే ఛాన్స్ వచ్చింది సుజిత్ కు. అలా పవన్ హీరోగా ఓజీ సినిమా తెరకెక్కించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుజిత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా రోజులను గుర్తు చేసుకున్నాడు. ఎన్టీఆర్ డ్రైవర్ తో జరిగిన ఓ సంఘటను చెప్పుకొచ్చాడు. తాను ఆంధ్రావాలా యుఫోరియాను ఫీల్ అయినట్లు చెప్పాడు. ఆంధ్రావాలా సినిమా వచ్చినప్పుడు మేం స్కూల్ లో చదువుకుంటున్నాం. అప్పుడే మా స్కూల్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది.
అప్పుడు తారక్ దగ్గర పని చేసిన ఓ వ్యక్తి అక్కడ మానేసి, మా స్కూల్ లో పనికి వచ్చాడు. ఆయన రోజు అక్కడ పని చేసేవాడు. ఓరోజు రాత్రి కనిపిస్తే.. నేను ఆయన్ను భయ్యా వాటర్ ఇవ్వు అని అడిగాను. దానికి ఆయన వెంటనే, ఏయ్ ! నేను ఎవరో తెలుసా? నేను జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటాను. అని చెప్పాడు. దానికి మేమంతా స్టన్ అయిపోయాం. అప్పుడు ఆంధ్రావాలా యుఫోరియా కదా.
ఇక ఎన్టీఆర్ ఎలా ఉంటారు? అక్కడ ఏం జరుగుతుంటది అని అడిగి మరీ తారక్ గురించి కథలు కథలుగా వినే వాళ్లం. అప్పుడు మేమంతా పిల్లోల్లం. 9వ తరగతి చదువుతున్నాం. ఆంధ్రావాలా పాటల క్యాసెట్ తెచ్చుకొని నాయిరే నాయిరే పాట వింటూ వైబ్ అయ్యే వాళ్లం. ఏ స్టార్ తో అయినా మనం ఓ సినిమా తీస్తే.. అది జనాలకు నచ్చితే ఒక మ్యాడ్ నెస్, యుఫోరియా ఏర్పడుతుంది. అని సుజిత్ ఆంధ్రావాలా రోజులు గుర్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.