నాని సుజిత్ రిలీజ్ టార్గెట్ ఫిక్స్..!

ఐతే ఓజీ తర్వాత సుజిత్ తన నెక్స్ట్ సినిమా న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.;

Update: 2025-10-03 06:09 GMT

OG తో పవర్ ప్యాక్డ్ హిట్ అందుకున్నాడు సుజిత్. పవన్ కళ్యాణ్ మీద అతనికి ఉన్న అభిమానం ఏంటో చూపించాడు. ఫ్యాన్స్ అంతా ఆయన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా చూపించాడు. ఐతే ఓజీ తర్వాత సుజిత్ తన నెక్స్ట్ సినిమా న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. బ్లడీ రోమియో టైటిల్ ని ఈ సినిమాకు పెట్టబోతున్నారని టాక్. ఐతే బ్లడీ రోమియో సినిమా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని తెలుస్తుంది.

ఒత్తైన జుట్టు గుబురు గడ్డంతో..

ఈ సినిమాను దసరా సందర్భంగా ముహూర్తం పెట్టారు. నాని ది ప్యారడైజ్ కోసం ఒత్తైన జుట్టు గుబురు గడ్డంతో కనిపించాడు. ఐతే బ్లడీ రోమియో లో నాని ఎలా కనిపిస్తాడన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈ సినిమా ముహూర్తం రోజే రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నాని ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ లాక్ చేశారు. ఆ డేట్ కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఐతే మార్చిలో నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఉండగా డిసెంబర్ లో మరో సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ సాహో, ఓజీ రెండు సినిమాలు కూడా ఎక్కూ టైం తీసుకుని చేశాడు. కానీ నాని సినిమాను మాత్రం మొత్తం 8, 9 నెలల్లో రిలీజ్ పూర్తి చేయబోతున్నారు. ఓజీ సినిమా తర్వాత సుజిత్ సినిమా మీద భారీ హైప్ ఉంది. అందులోనూ నానితో చేస్తున్న సినిమా కాబట్టి మరింత క్రేజ్ ఉంది.

బ్లడీ రోమియోలో డిఫరెంట్ అటెంప్ట్..

నాని ప్రతి సినిమాను పఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమాలో జడల్ రోల్ తో డిఫరెంట్ ఎక్స్ పెరిమెంట్ చేస్తున్నాడు. మరోసారి బ్లడీ రోమియోలో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. సుజిత్ టేకింగ్ తప్పకుండా నాని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. నాని ది ప్యారడైజ్ సినిమా కూడా శ్రీకాంత్ ఓదెల డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. సినిమాలో ప్రతి యాస్పెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుందట.

దసరాతో శ్రీకాంత్ ఓదెల నానికి మాస్ హిట్ ఇచ్చాడు. ది ప్యారడైజ్ తో మరో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. నాని సుజిత్ కలయికలో వస్తున్న సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాంబో సినిమా ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News