భూ వివాదంలో చిక్కుకున్న ఖాన్ డాటర్
కింగ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ, బిగ్ కెరీర్‌ని నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే.;
కింగ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ, బిగ్ కెరీర్‌ని నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. 'ది ఆర్చీస్' వెబ్ సిరీస్ తర్వాత, తన తండ్రి షారూఖ్ తో కలిసి `కింగ్` అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఒక్క సినిమా అయినా రిలీజ్ కాక ముందే ఖాన్ వారసురాలి క్రేజ్ చుక్కల్ని తాకుతోంది. మరోవైపు సుహానా ఒక లీగల్ ట్రబుల్‌ని ఎదుర్కోవడం ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇప్పుడు సుహానా ఊహించని విధంగా ఒక భూమి విషయమై చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుపోయింది. అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో వ్యవసాయ భూమి ఒప్పందం కారణంగా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. తాజా మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం రైతులకు కేటాయించిన భూమిని సరైన అనుమతులు, కాగితపు పత్రాలు సేకరించకుండా సుహానా ఖాన్ కొనుగోలు చేసింది. దీనిని ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఇచ్చిన విషయాన్ని పరిగణించలేదు.
ఈ వ్యవసాయ భూమి విలువ రూ. 12.91 కోట్లు ఉంటుందని అంచనా. దీనిని ముంబైలోని కఫే పరేడ్‌లో నివసించే ఖోటే కుటుంబం నుండి సుహానా ఖాన్ కొనుగోలు చేసింది. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 77.47 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. 30 మే 2023న డబ్బు బదిలీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ద్వారా జరిగింది. దర్యాప్తు సమయంలో అలీబాగ్ తహసీల్దార్ నుండి నివేదికను కూడా కోరారు. రెసిడెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ఈ వివాదంపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.