ట్రెండ్ ఫాలో అవ్వనంటోన్న యంగ్ హీరో!
సినిమాల విజయాల విషయంలో ఓ ట్రెండ్ కొనసాగుతుంటుంది. కొంత కాలంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలు మంచి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే.;
సినిమాల విజయాల విషయంలో ఓ ట్రెండ్ కొనసాగుతుంటుంది. కొంత కాలంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలు మంచి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఎలాంటి హీరో నటించినా ఆ సినిమా విజయం దిశగా పయనిస్తుంది. దీంతో చాలా మంది హీరోలు అదే జానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సక్సెస్ లో ఉన్న ట్రెండ్ ని వదిలేసి కొత్తగా ప్రయోగాలు చేయడం దేనికని సక్సెస్ ఏ మార్గంలో వస్తుందో? దాన్నే ఎంచుకుంటారు హీరోలు. దర్శక, రచయితలు కూడా హీరోలు ఎలాంటి స్టోరీలకు లాక్ అవుతారో? ముందుగానే ఓ అంచనా ఉంటుంది.
దాన్ని బట్టి కథలు సిద్దం చేస్తుంటారు. అయితే సుధీర్ బాబు మాత్రం ఎలాంటి ట్రెండ్ ఫాలో అవ్వనంటున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన `జటాధర` రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్రెండ్ గురించి మాట్లాడారు. `మా సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో దైవిక అంశాలు, హారర్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ ఇదంతా యాదృశ్చకమే తప్ప పని గట్టుకుని ఇలా చేయలేదన్నారు. తన కెరీర్ లో ఎప్పుడు ట్రెండ్ ఆధారంగా సినిమాలు చేయలేదన్నారు.
`జఠాధర` తెలుగు సినిమా. కానీ నిర్మాతలు బాలీవుడ్ నుంచి వచ్చారన్నాడు. ముందు వారు సొంత కథతో నా దగ్గరకు వచ్చారు. కానీ వారు చెప్పిన కథ నచ్చలేదు. దీంతో నా దగ్గర కథ ఉందని చెప్పాను. కథ ఉంటే మీరే చెప్పండని అడిగితే ఆ ఛాన్స్ తీసుకున్నాను. వాళ్లకు నచ్చింది. గతంలో విజయవంతమైన సినిమాలు చేసిన అనుభవం ఉంది వాళ్లకు. ఈనేపథ్యంలో తన దగ్గర ఉన్న కథ పట్లవారు ఆసక్తిగా ఉండటంతో ప్రాజెక్ట్ మొదలైందన్నాడు. అంతేకానీ ఏదో ట్రెండ్ నడుస్తుందని ఈ సినిమా తాను చేయలేదన్నాడు సుధీర్ బాబు.
ట్రెండ్ అన్నది ఇప్పటికిప్పుడు ఎలా ఉంది? అన్నది మాత్రమే తెలుస్తుంది. రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ట్రెండ్ ఆధారంగా సినిమా ఎలా చేయలగను? కథల ఎంపిక విషయాలో ఇది సరైన ఆలోచన కాదన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నాడు. నాకు తెలిసి ట్రెండ్ ఆధారంగా ఎవరూ సినిమా తీయాలనుకోరు. రిలీజ్ అయిన చిత్రాలన్నీ ఒకే జానర్లో ఉండి , ఒకేసారి రిలీజ్ అయి సక్సెస్ అయితే దాన్నే ట్రెండ్ గా భావిస్తున్నారు. కానీ ఇది అన్ని వేళలా సాధ్యం కాదు అని అన్నారు.