• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి సక్సెస్.. నెక్స్ట్...

కల్కి సక్సెస్.. నెక్స్ట్ ఆ సినిమాపైనే అందరి ఫోకస్..

| ఇదిలా ఉంటే ఈ కల్కి మూవీ కారణంగా ఇప్పుడు బిటౌన్ లో సూర్య చేయబోయే కర్ణ సినిమా గురించి చర్చ మొదలైంది.

By - Tupaki Desk
Update: 2024-06-28 06:31 GMT

కల్కి 2898ఏడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ తో మైథలాజికల్ కథలని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారని ప్రూవ్ అయ్యింది. పుస్తకాలలో ఉన్న కథలని వక్రీకరించకుండా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరపై ఆవిష్కరిస్తే ఆదరించడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. అందరికి తెలిసిన కథలే అయిన ఈ జెనరేషన్ హీరోలతో టెక్నాలజీ ఉపయోగించుకొని మైథాలజీ స్టోరీస్ చెప్పొచ్చు అని కల్కి 2898ఏడీ ప్రూవ్ చేసింది.

నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ చిత్ర కథాంశాన్ని మైథాలజీ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉపయోగించుకొని ఫ్యూచరిస్టిక్ మూవీగా ఆవిష్కరించారు. ఓ విధంగా చెప్పాలంటే కల్కి మూవీ మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వీకెండ్ వరకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ కల్కి మూవీ కారణంగా ఇప్పుడు బిటౌన్ లో సూర్య చేయబోయే కర్ణ సినిమా గురించి చర్చ మొదలైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సూర్య హీరోగా కర్ణ మూవీ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రలో జాన్వీ కపూర్ ని ఖరారు చేశారంట. అయితే ఈ సినిమాని ఎనౌన్స్ చేసి ఏడాది అవుతోన్న ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.

కల్కి సినిమాలో కురుక్షేత్రం ఎపిసోడ్ లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కొద్దిసేపు కనిపించాడు. ఈ సీక్వెన్స్ కి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే విజిల్స్ పడ్డాయి. దీనిని బట్టి అర్జునుడి కంటే కర్ణుడి పాత్రకి ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా రాబోయే కర్ణ సినిమాకి పబ్లిక్ నుంచి ఇంతే రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

సూర్య కంగువ మూవీతో అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తర్వాత కర్ణ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి కర్ణుడి పాత్రలో సూర్య ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే బాలీవుడ్ లో కూడా అశ్వత్థామ కథకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు కానీ ఒక స్టార్ తోనే ఆ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags:    
  • Kalki2898AD 
  • Kalki 
  • Prabhas 
  • Kanguva 
  • Suriya 
  • Rakeshomprakashmehra 
  • Mythologyelements 
  • Characters 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS