సు ఫ్రమ్‌ సో.. కన్నడ దెయ్యం తెలుగు టాక్ ఏంటీ?

కథలో వచ్చే హారర్‌ మోడ్స్‌ పెద్దగా భయపెట్టకపోయినా, గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో డ్రామా, ఫన్‌ కలగలిపిన విధానం మాత్రం బాగుంది.;

Update: 2025-08-08 14:32 GMT

ఓ చిన్న ఊరు, పక్కా రియలిస్టిక్‌ క్యారెక్టర్స్‌, అనుకోని కామెడీ సన్నివేశాలు, అందులో దెయ్యం డ్రామా కలిసిన కొత్త కథతో ‘సు ఫ్రమ్‌ సో’ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఇప్పటికే ఊహించని బ్లాక్‌బస్టర్‌ అయిన ఈ సినిమా 3 కోట్ల పెట్టుబడికి 35 కోట్లు తెచ్చింది. దీంతో తెలుగు వెర్షన్‌పై ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. అసలు, కన్నడ మాస్‌ ఆడియన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ కథ మన తెలుగు ఆడియన్స్‌ని ఎంతవరకు నవ్వించింది? ఫస్ట్‌డే ఫస్ట్‌ షో తరువాత సోషల్ మీడియాలో ఫీడ్, థియేటర్‌ లోని ప్రేక్షకుల రెస్పాన్స్‌తోపాటు సినీ విశ్లేషకుల స్పందన చూస్తే..

ఊరి మనుషుల లోకల్‌ ఫీల్, వాళ్ల మధ్య సింపుల్‌గా పండే ఫన్‌, మినిమలిస్ట్‌ కాన్సెప్టు ఇది. ఓ చిన్న తప్పు కోసం దెయ్యం లాంటి డ్రామా చేయడంతో ఆ ఊరిలో ఎలాంటి హడావుడి జరుగుతుందనే లైన్ తో కథ సాగుతుంది. మామూలుగా ప్రేక్షకులకు అలవాటు అయిన కథ కాదు. కానీ, తెలుగు ఆడియన్స్‌కి మాస్‌ కామెడీకి కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది. సోషల్ మీడియాలో చూసిన వాళ్లే, “అసలు ఇందులో దెయ్యం ఉందా లేదా అన్నదే అసలు సస్పెన్స్‌!” అని కామెంట్ చేస్తున్నారు.

ఇక ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే, మొదటి భాగంలో రవన్న (షానిల్‌ గౌతమ్‌), అశోక్‌ (జేపీ తుమినాడ్‌) పాత్రలు తెరపై కనిపించగానే ఫుల్ ఎంటర్టైన్మెట్ అనిపించిందనే కామెంట్స్ వస్తున్నాయి. ‘‘మన ఊర్లో ఇలాంటి వాళ్లు చూస్తూనే ఉంటాం కదా’’ అంటూ పలువురు కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా బావ పాత్రకి ‘‘వచ్చాడు వచ్చాడు’’ అంటూ వచ్చే సాంగ్‌ థియేటర్‌లో మంచి నవ్వులు పండించింది. ఫన్నీ, ఫన్‌కీ గా సాగిన తొలి భాగం, గురూజీ (రాజ్‌ బి శెట్టి) ఎంట్రీతో మరింత స్పీడప్‌ అయ్యింది. ఆయన కామెడీ టైమింగ్‌, డైలాగ్స్‌కి విజిల్స్ కూడా పడుతున్నాయి.

కథలో వచ్చే హారర్‌ మోడ్స్‌ పెద్దగా భయపెట్టకపోయినా, గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో డ్రామా, ఫన్‌ కలగలిపిన విధానం మాత్రం బాగుంది. ముఖ్యంగా, రెండో భాగంలో సులోచన కూతురి కథకి ఎమోషన్‌ టచ్‌ ఇచ్చారు. కొంతమందికి, ఇక్కడే సినిమా పేస్‌ తగ్గినట్టు అనిపించింది. ‘‘ఫస్ట్ హాఫ్‌ కామెడీ, సెకండ్ హాఫ్‌లో కొంత సీరియస్‌ గా సాగుతుంది’’ అని చెప్పినవాళ్లే ఎక్కువ. అయినా, క్లైమాక్స్‌లో అశోక్‌ చేసే యాక్షన్‌ హంగామా మాత్రం కిక్కిచ్చిందని టాక్‌.

అంతా చూస్తే, సినిమాలో బలంగా నిలిచింది కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల సహజత్వం. ఫామ్‌లో నటీనటులు నవ్విస్తే, ఎమోషన్‌ లైన్‌ను కూడా కథలో భాగంగా పర్ఫెక్ట్ గా చూపించారు. కమర్షియల్‌ హారర్‌ సినిమాల్ని ఎక్స్పెక్ట్‌ చేసిన వాళ్లకు మాత్రం ఇది కొంచెం సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ, ‘కథలో కొత్తదనం, ఎంటర్‌టైన్‌మెంట్‌, హ్యూమన్‌ టచ్‌ కావాలి’ అనుకునే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా నచ్చే సినిమా.

డిఫరెంట్ ఫీల్‌, నేటివిటీకి దగ్గరగా ఉండే కథలు మనలోని చిన్నపిల్లాడిని బయటకు తెచ్చేస్తాయన్నదానికి ‘సు ఫ్రమ్‌ సో’ లైవ్‌ ప్రూఫ్‌. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. చాలా పెద్ద లెవెల్‌ గుర్తింపు దక్కించుకుంది. చివరగా, ‘‘దెయ్యం లేని దెయ్యం మూవీ.. నవ్విస్తూనే, కొంత ఆలోచింపజేస్తుంది’’ అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News