ఒక్కో ఎపిసోడ్.. ఓ చిన్న సినిమా అంతనా?
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 ను రెండు భాగాలుగా చేసి పూర్తి చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ రాగా, ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ నిడివి ఏకంగా 2 గంటలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.;
సోషల్ మీడియా వాడకం పెరిగాక ఓటీటీలకు డిమాండ్, క్రేజ్ బాగా పెరిగాయి. ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఓటీటీలో ఉత్కంఠ కలిగించే వెబ్‌సిరీస్ లకు ఉండే స్పెషాలిటీనే వేరు. వాటి కోసం ఆడియన్స్ ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్ని వెబ్‌సిరీస్‌లకు ఎవరూ ఊహించని రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది.
అయితే ఏ వెబ్‌సిరీస్ అయినా కొన్ని ఎపిసోడ్లుగా రిలీజవుతూ ఉంటుంది. అందులో ఒక్కో ఎపిసోడ్ అరగంట నుంచి గంట వరకు ఉంటుంది. చాలా తక్కువ సిరీస్‌లు మాత్రమే ఒక్కో ఎపిసోడ్ నిడివిని భారీగా ప్లాన్ చేసుకుంటాయి. అయితే అలాంటి సిరీస్‌లు చాలా అరుదు. ఇప్పుడు ఈ తరహాలో భారీ ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయడానికి ఓ హాలీవుడ్ సిరీస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
అదే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న సూపర్ నేచురల్ హాలీవుడ్ థ్రిల్లర్ స్ట్రేంజర్ థింగ్స్. ఇప్పటికే ఈ సిరీస్ లో నాలుగు సీజన్లు రాగా, అవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో సీజన్5 పై భారీ హైప్ నెలకొంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 కోసం ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్5 గురించి ఇప్పుడో షాకింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది.
రెండు భాగాలుగా రానున్న సీజన్5
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 ను రెండు భాగాలుగా చేసి పూర్తి చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ రాగా, ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ నిడివి ఏకంగా 2 గంటలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెబ్ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ ఇంత రన్ టైమ్ కలిగి ఉండటం చాలా రేర్ గా చూస్తుంటాం. గతంలో ఒక్కో ఎపిసోడ్ గంటకు పైగా ఉంటుందన్నారు కానీ ఇప్పుడు ఏకంగా రెండు గంటలు అంటుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఒక్కో ఎపిసోడ్ ను 50-60 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. నవంబర్ 27న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 మొదటి వాల్యూమ్ నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.