• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోలు.. అసలు పని...

స్టార్ హీరోలు.. అసలు పని సమ్మర్ లోనే..

| టాలీవుడ్ టాప్ స్టార్స్ కి సంబంధించి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By - Tupaki Desk
Update: 2024-02-06 01:30 GMT

టాలీవుడ్ టాప్ స్టార్స్ కి సంబంధించి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అందరూ ఈ ఏడాదే తమ కొత్త సినిమాలని సెట్స్ పై తీసుకెళ్లబోతున్నారు. ఈ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుండడం విశేషం. ఇంతకీ ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ గురించి పరిశీలిస్తే...

పవన్ కళ్యాణ్ : ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జూన్ లో 'OG' సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నారట. అంటే ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్ ని పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ నాటికి ఈ సినిమా పూర్తవుతుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాని పట్టాలెక్కించనున్నారట.

ప్రభాస్ : సలార్ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ గతేడాది రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఈ ఏడాది కూడా కల్కి, రాజా సాబ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయగానే ఈ సమ్మర్ లో సలార్ సీక్వెల్ స్టార్ట్ చేయబోతున్నారట.

NTR : ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ ఏప్రిల్ లో పూర్తికానున్నట్లు తెలిసింది. ఈ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే తారక్ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కానున్నాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే రాజమౌళి తో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ కోసం కసరత్తులు మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లోనే స్టార్ట్ చేయనున్నారు.

అల్లు అర్జున్ : 'పుష్ప 2' షూటింగ్ ని జూన్ కల్లా పూర్తిచేసి ఇమీడియట్ గా అట్లీ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడట బన్నీ. పుష్ప 2 షూటింగ్ ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆగస్టు నెలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

Tags:    
  • Pawankalyan 
  • Ogmovie 
  • Ramcharan 
  • Filmindustry 
  • Devara 
  • NTR 
  • Pushpa2 
  • Alluarjun 

Similar News

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS