• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రాండ్ ఇమేజ్ తో హైప్...

బ్రాండ్ ఇమేజ్ తో హైప్ మాత్రమే.. కానీ మూవీ నిలబడాలంటే?

| సాధారణంగా ఏ సినిమా వెనుక అయిన బ్రాండ్ ఇమేజ్ ఉంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావడం సహజం. స్టార్ హీరో కొడుకు దర్శకుడిగా వస్తున్నా.. స్టార్ డైరెక్టర్ సినిమా సమర్పిస్తున్నా.. లేక నిర్మాతగా వ్యవహరిస్తున్నా అంచనాలు పెరుగుతాయి.

By - M Prashanth
Update: 2026-10-03 10:10 GMT

సాధారణంగా ఏ సినిమా వెనుక అయిన బ్రాండ్ ఇమేజ్ ఉంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావడం సహజం. స్టార్ హీరో కొడుకు దర్శకుడిగా వస్తున్నా.. స్టార్ డైరెక్టర్ సినిమా సమర్పిస్తున్నా.. లేక నిర్మాతగా వ్యవహరిస్తున్నా అంచనాలు పెరుగుతాయి. కానీ ఆ అంచనాలను నిలబెట్టేది మాత్రం కంటెంట్. రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీలు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాయి.

దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా సిగ్మా. విజయ్‌ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల జేసన్ తొలి సినిమాపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది.. తన తండ్రి ఇమేజ్‌ కు భిన్నంగా ఏదైనా ఫ్రెష్ గా చూపిస్తారా అనే ఇంట్రెస్ట్ కూడా కనిపించింది. దీంతో సినిమా విడుదలకు ముందే డిబేట్ జరిగింది.

కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోయింది. ఇక్కడే అసలు విషయం కనిపిస్తుంది. విజయ్ కొడుకు అనే గుర్తింపు సినిమాపై హైప్ పెంచొచ్చు. కానీ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుడు ఆ గుర్తింపును పక్కన పెట్టి కథ, దర్శకత్వం, సినిమా టేకింగ్ గురించే మాట్లాడతాడు. పేరు సినిమాను పరిచయం చేయొచ్చు.. కానీ సినిమాను నిలబెట్టేది మాత్రం కంటెంట్.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఫహద్ ఫాజిల్ నటించిన ఆసినిమాకు ఎస్‌.ఎస్. కార్తికేయ నిర్మాత. రాజమౌళి సమర్పకుడిగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కార్తికేయ నిర్మాతగా చేస్తున్న సినిమా కావడం.. రాజమౌళి పేరు కూడా ఉండటంతో సినిమా కచ్చితంగా ఏదో కొత్తగా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. కానీ విడుదల తర్వాత వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిరాశపరిచింది.

ఇక సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా వచ్చిన రోమాంచకం కూడా ఇదే చర్చకు కారణమైంది. ఆయన నిర్మాతగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో దర్శకుడిగా ఆయన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ కూడా దీనికి ఒక కారణం. కానీ అనుకున్న స్థాయిలో సినిమా రిజల్ట్ ఇవ్వలేదనే టాక్ వచ్చింది. దీంతో నిర్మాతగా కూడా స్టార్ డైరెక్టర్ ఉంటే అంచనాలు పెరుగుతాయని, కానీ ఆ అంచనాలను నిలబెట్టే బాధ్యత చివరకు సినిమా మీదే ఉంటుందని మరోసారి స్పష్టమైంది.

అయితే ఇలాంటి రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన వారి సినీ జర్నీ ఆగిపోదు. సంజయ్‌ కు దర్శకుడిగా మరో అవకాశం రావచ్చు. కార్తికేయ నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయొచ్చు. సందీప్ రెడ్డి వంగాకు కూడా మళ్లీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక్క సినిమా రిజల్ట్ కంటే తర్వాతి మూవీ ఏం చెబుతుందనేదే ముఖ్యం. అందుకే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, స్టార్ ఇమేజ్, బ్రాండ్ ఇవన్నీ హైప్ కు ఉపయోగపడతాయి. కానీ మూవీ నిలబడాలంటే మాత్రం ఆ బ్రాండ్ కంటే సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రేక్షకుడు చివరకు బ్రాండ్ చూడడు.. స్క్రీన్ పై సినిమా ఎలా ఉందో చూస్తాడు.

Tags:    
  • sigma 
  • donttroublethetrouble 
  • sandeepreddyvanga 
  • tollywood 
  • moviecontent 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS