హోస్టింగ్ వైపు మొగ్గు చూపుతున్న స్టార్ హీరోస్.. కారణం?
సినిమా హీరోలు టీవీ, ఓటీటీ షోలు హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. నాగార్జున బిగ్‌బాస్‌తో చాలా ఏళ్లుగా కొనసాగుతుండగా, నాని కూడా బిగ్‌బాస్ రెండో సీజన్ హోస్ట్ చేశారు.
సినిమా హీరోలు టీవీ, ఓటీటీ షోలు హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. నాగార్జున బిగ్‌బాస్‌తో చాలా ఏళ్లుగా కొనసాగుతుండగా, నాని కూడా బిగ్‌బాస్ రెండో సీజన్ హోస్ట్ చేశారు. ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు. మరోవైపు బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌తో ఓటీటీలోనే తనకంటూ ప్రత్యేకమైన షో క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు తేజ సజ్జా ప్రైమ్ వీడియోలో ది ట్రైటర్స్ తెలుగు హోస్ట్‌గా వస్తుండటం, చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ టాక్ షో చేయొచ్చనే వార్తలు రావడంతో స్టార్ హీరోల హోస్టింగ్ ట్రెండ్ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది.
తేజ సజ్జా సెలక్షన్ మాత్రం కాస్త కొత్తగా ఉంది. హనుమాన్, మిరాయ్ తర్వాత అతనికి యంగ్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ రీచ్ కూడా పెరిగింది. అలాంటి టైమ్‌లో సినిమా గ్యాప్‌లో మరో ఫిల్మ్ కాకుండా, మైండ్ గేమ్ షో చేయడం వల్ల స్క్రీన్‌పై రెగ్యులర్ గా కనిపించి ఆడియెన్స్ కి మరింత దగ్గరవ్వచ్చు. హీరో ఇమేజ్ కాకుండా ఆయన మాటతీరు, రియాక్షన్స్ కూడా ఆడియన్స్‌కు తెలిసే అవకాశం వస్తుంది. ది ట్రైటర్స్ తెలుగు అక్టోబర్ 15 నుంచి స్ట్రీమ్ కానుంది.
చిరంజీవి నెట్ ఫ్లిక్స్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నెట్‌ఫ్లిక్స్ సెలబ్రిటీ టాక్ షో లేదా పాడ్‌కాస్ట్ తరహా ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్‌కు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనతో మాట్లాడే అతిథులు, పాత ఇండస్ట్రీ కథలు, సినిమాల వెనుక అనుభవాలు వస్తే ఆ ఫార్మాట్‌కే ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది.
హీరోలకు హోస్టింగ్‌లో ఇంకో ప్రయోజనం ఉంది. సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ చూసేది వాళ్లు చేసిన పాత్రను మాత్రమే. షోలో మాత్రం వాళ్ల అసలు మాటతీరు, హ్యూమర్, రియాక్షన్స్ బయటపడతాయి. బాలకృష్ణకు అన్‌స్టాపబుల్ తర్వాత వచ్చిన కొత్త ఇమేజ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నాగార్జున బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌ను హ్యాండిల్ చేసే విధానం, ఎన్టీఆర్ గేమ్ షోల్లో కనిపించిన స్పాంటేనిటీ కూడా వాళ్లను ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు స్టార్ హీరో హోస్ట్‌గా ఉంటే షోకి మొదటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది. తేజ సజ్జా లాంటి యంగ్ హీరో ఉంటే కొత్త జనరేషన్‌ను ఈజీగా ఆకర్షించొచ్చు. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాత తరం అభిమానుల వరకు పెద్ద సెక్షన్ ఎట్రాక్ట్ అవుతుంది. అందుకే ప్లాట్‌ఫామ్‌లు కూడా కొత్త షోలకు తెలిసిన స్టార్స్ ను తీసుకొస్తున్నాయి.
మరో అతి ముఖ్యమైన కారణం.. హీరోల సినిమా గ్యాప్. ఇప్పుడు ఒక్కో పెద్ద సినిమా పూర్తవ్వడానికి ఏడాది దాటిపోతోంది. షూటింగ్, వీఎఫ్‌ఎక్స్, రిలీజ్ ప్లానింగ్‌తో హీరోలు చాలా కాలం స్క్రీన్‌పై కనిపించకపోవచ్చు. అలాంటి గ్యాప్‌లో ఒక షో హోస్ట్ చేస్తే ఆడియన్స్‌తో కనెక్షన్ కొనసాగుతుంది. సినిమా రిలీజ్ లేకపోయినా వారానికి ఒకసారి కనిపించడం వల్ల వాళ్ల ఇమేజ్ కూడా యాక్టివ్‌గానే ఉంటుంది.