• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోలు 2024 ఎలా...

స్టార్ హీరోలు 2024 ఎలా ముగిస్తున్నారంటే?

| 2024 ముగింపుకు ఇంకా 50 రోజులే స‌మ‌యం ఉంది. కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదికి వెల్క‌మ్ చెప్ప‌డానికి ప్రేక్ష‌కులంతా సిద్ద‌మ‌వుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-13 21:30 GMT

2024 ముగింపుకు ఇంకా 50 రోజులే స‌మ‌యం ఉంది. కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదికి వెల్క‌మ్ చెప్ప‌డానికి ప్రేక్ష‌కులంతా సిద్ద‌మ‌వుతున్నారు. మ‌రి కోలీవుడ్ ఈ ఏడాదిని ఎలా ముగించ‌బోతుంది అంటే? 2024 ప్ర‌ధ‌మార్ధం అంటే జూన్ వరకు కేవలం 3-4 హిట్ సినిమాలు మాత్ర‌మే అక్క‌డ క‌నిపిస్తున్నాయి. వాటిలో `మంజుమ్మ‌ల్ బోయ్స్`, `విజ‌య్ `గిల్లీ` రీ-రిలీజ్ చిత్రం ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో స‌క్సెస్ అయ్యాయి.

మిగ‌తా సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు అందించలేదు. ద్వితియార్ధంలో మాత్రం విభిన్న తరహా సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్వితియార్ధంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి న‌టించిన `మ‌హారాజ` విజ‌యంతో మోక్షం క‌లిగింది. ఇది స్ట్రెయిట్ త‌మిళ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అటుపై `గరుడన్`, మరి సెల్వరాజ్ `వాజై`, `అరుళ్నిధి` యొక్క `డిమొంటే కాలనీ-2`, `లబ్బర్ పండు`, `మెయ్యళగన్` , `బ్లాక్` వంటి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధించాయి. ఈ సినిమాల‌కు థియేట‌ర్ ఆక్యుపెన్సీ బాగుంది. అటుపై ధనుష్ న‌టించిన `రాయన్`, విజయ్ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్`, రజనీకాంత్ ` వేట్టైయన్` వంటి సినిమాలు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా నిరుత్సాహ ప‌రిచాయి.

ఈ మూడు సినిమాలకు ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వ‌చ్చింది. అయితే ఇటీవ‌ల రిలీజ్ అయిన శివ కార్తికేయ‌న్ `అమ‌రన్` మాత్రం బాక్సాఫీస్ ని మ‌ళ్లీ మోత మోగించింది. 250 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది కోలీవుడ్ కి దీపావ‌ళి హిట్. మ‌రికొన్ని గంట‌ల్లో సూర్య న‌టించిన `కంగువ` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. సూర్య తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇది. ఈ సినిమా స‌క్సెస్ తో 2024 హ్యాపి ఎండింగ్ అవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
  • Starheroes 
  • Manjummelboys 
  • Kollywood 
  • Filmindustry 
  • Lubberpandu 
  • Maharajamovie 
  • Amaranmovie 
  • Kanguva 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS