SSMB29 : ఈ విషయం తెలుసా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ అడ్వంచర్‌ థ్రిల్లర్ కొత్త షెడ్యూల్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.;

Update: 2025-06-15 10:30 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ అడ్వంచర్‌ థ్రిల్లర్ కొత్త షెడ్యూల్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమ్మర్ హాలీడేస్‌ ను తీసుకున్న మహేష్‌ బాబు, రాజమౌళి తిరిగి పని ప్రారంభించంఏదుకు రెడీ అయ్యారని ఇటీవలే చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి సమాచారం అందింది. మొదట అనుకున్న దాని ప్రకారం ఈ షెడ్యూల్‌ను ఆఫ్రికాలో తీయాల్సి ఉంది. కానీ హైదరాబాద్‌లోనే వారం నుంచి పది రోజుల పాటు షూటింగ్‌ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. వచ్చే నెలలో లేదా త్వరలోనే ఆఫ్రికా షెడ్యూల్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జక్కన్న గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో హాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించిన రాజమౌళి ఈసారి ఏకంగా హాలీవుడ్‌లో కూడా విడుదల చేసే విధంగా SSMB29 సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా అన్ని భాషల వారికి తగ్గట్టుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంటున్నాయి. హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఇండియన్‌ సినిమా మార్కెట్‌ పెరిగింది. అందుకే ఈ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని విధాలుగా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అసలు సినిమా నేపథ్యం ఏంటి అనేది కూడా అధికారికంగా మేకర్స్ నుంచి స్పందన రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. కథ అది.. ఇది అని, నేపథ్యం అది అంటూ చాలా చాలా పుకార్లు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందట. కథ ఫస్ట్‌ హాఫ్‌ మొత్తంలో కూడా మహేష్ బాబు పాత్ర కథలో పూర్తి నెగిటివ్‌ షేడ్స్‌ను కలిగి ఉంటుందట. ఇలా ఉండేంటి అనే విధంగా మహేష్ బాబు పాత్ర ఉంటుందట, కానీ సెకండ్‌ హాఫ్‌ లో మాత్రం పూర్తిగా మారుతుందట. సెకండ్‌ హాఫ్‌ లో పాజిటివ్‌గా, హీరోయిక్‌ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడట.

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్న విషయం తెల్సిందే. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ ఆఫ్రిక రచయిత విల్బర్‌ స్మిత్‌ రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాలోని కథ ఇండియన్ ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది అన్నాడు. ఈ సినిమా కు ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఒక రచయితగా వ్యవహరించడం విశేషం. దేవా కట్టా తో కీలక సన్నివేశాలకు గాను డైలాగ్స్‌ను రాజమౌళి రాయిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించేందుకు గాను రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News