వార‌ణాసిలో మ‌హేష్ ఉసెన్ బోల్ట్ లా!

ఎస్ ఎస్ ఎంబీ 29 `వార‌ణాసి ` ఓ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్. ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే స్టోరీ. రామాయ‌ణంలో రాముడి పాత్ర‌ను స్పూర్తిగా తీసుకుని మ‌హేష్ పాత్ర‌ని తీర్చి దిద్దుతున్నారు.;

Update: 2025-12-07 14:30 GMT

ఎస్ ఎస్ ఎంబీ 29 `వార‌ణాసి ` ఓ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్. ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే స్టోరీ. రామాయ‌ణంలో రాముడి పాత్ర‌ను స్పూర్తిగా తీసుకుని మ‌హేష్ పాత్ర‌ని తీర్చి దిద్దుతున్నారు. మ‌రి అడ‌వుల నేప‌థ్యంలో సాగే క‌థ‌కు..రాముడికి ఎలాంటి లింక్ ఉంటుంద‌న్న‌ది వెయిట్ అండ్ సీ. ఇందులో మ‌హేష్ ఓ సాహ‌స‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అడ‌విలో అత‌డో హంట‌ర్. రాజ‌మౌళి గ‌త చిత్రాల్లో హీరోల పాత్ర‌ల‌కు పూర్తి భిన్నంగా మ‌హేష్ రోల్ ఉంటుంది. హాలీవుడ్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ లాగే ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి. ఈనేప‌థ్యంలో మ‌హేష్ రోల్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

సూప‌ర్ స్టార్ ర‌న్నింగ్ స్పెష‌లిస్ట్:

అత‌డు ఎంత కొత్త‌గా క‌నిపిస్తాడని ఒకటే డిబేట్ న‌డుస్తోంది. లుక్ నుంచి మ‌హేష్ పాత్ర‌ను మ‌లిచే తీరు పై చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే మ‌హేష్ మంచి ర‌న్న‌ర్ కూడా. రోజు వ్యాయామంలో భాగంగా గంట పాటు గ్యాప్ ఇవ్వ‌కుండా ప‌రిగెడ‌తాడు. మ‌హేష్ బ్యూటీ సీక్రెట్ కూడా అదే. ర‌న్నింగ్ తో ఎన్నో ప్ర‌యోజనాలు. మంచి ఆరోగ్యంతో పాటు.. .అందం సొంత‌మ‌వుతుంది. మ‌హేష్ ర‌న్నింగ్ రెగ్యుల‌ర్ గా ఉండ‌దు. రన్నింగ్ లో అత‌డి కంటూ ఓ స్టైల్ ఉంటుంది. అత‌డు స్టైల్ ని మ‌రే న‌టుడు రీప్లేస్ చేయ‌లేనిది. ప్ర‌భాస్, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, బ‌న్నీ కొంత మంది స్టార్లు ఉన్నారు.

బోల్ట్ తో మ‌హేష్ పోలిక‌:

వీళ్లు చాలా సినిమాల్లో ఛేజింగ్ స‌న్నివేశాల్లో న‌టించారు. కానీ వారి ర‌న్నింగ్ కు రాని గుర్తింపు మ‌హేష్ ప‌రుగుకి వ‌చ్చింది. ఇండస్ట్రీ స‌హా ప్రేక్ష‌కులు మ‌హేష్ ర‌న్నింగ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటారు. ఇలాంటి ర‌న్నింగ్ స‌న్నివేశాలు రాజ‌మౌళి యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ లో కొద‌వుండ‌దు. సాహ‌సుకుడి రోల్ కాబ‌ట్టి? జంగిల్ లో మ‌హేష్ వేటాడే స‌న్నివేశాలెన్నో ఉంటాయి. తాజాగా మ‌హేష్ ర‌న్నింగ్ ని జ‌మైకా చిరుత పులి ఉసెన్ బోల్డ్ తో పోల్చుతున్నారు. మ‌హేష్‌ ర‌న్నింగ్ స్టైల్ అచ్చంగా బోల్డ్ ని పోలి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ పోలిక‌పై రాజ‌మౌళి ఏమంటాడో చూడాలి.

బోల్ట్ ని దించేస్తే స‌రి:

అత‌డు అంగీక‌రిస్తే? ఆ స్టైల్ ని జ‌క్క‌న్న తెలివిగా ఎన్ క్యాష్ చేస్తాడు. బోల్ట్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్. `వార‌ణాసి` కూడా 120 దేశాల్లో రిలీజ్ అయ్యే చిత్రం. కాబ‌ట్టి త‌న సినిమా ప్ర‌చారం కోసం బోల్ట్ ని దించేసినా? ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. బోల్డ్ ని మ‌హేష్ ని ప‌క్క‌ ప‌క్క‌న నిల‌బెట్టి ఓ ఈవెంట్ చేస్తే? పాన్ వ‌ర‌ల్డ్ కే సినిమా రీచ్ అవుతుంది. హాలీవుడ్ వేదిక‌ల‌పైనా ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బోల్డ్ ని దించ‌డం రాజ‌మౌళికి పెద్ద ప‌నేం కాదు.

Tags:    

Similar News