SSMB 29 పై బిగ్ అప్డేట్!
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత.;
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే SSMB 29 షూటింగ్, కథ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొంతమందేమో ఇది పురాణాలను బేస్ చేసుకుని వస్తుంది అంటే, మరి కొంతమందేమో యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అంటున్నారు. అయితే ఇంకొంతమందేమో పురాణాలు , యాక్షన్ అడ్వెంచర్స్ రెండు కలగలిపి తీస్తున్నారని ఇలా ఎన్నో రూమర్లు వైరల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. మరి ఇంతకీ నిర్మాత ఇచ్చిన ఆ షూటింగ్ అప్డేట్ ఏంటి.. ? ప్రస్తుతం ఈ షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మధ్యనే రామోజీ ఫిలిం సిటీలో ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి కొంతవరకు చిత్రీకరణ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం టాంజానియా, నైరోబి ప్రాంతాలకు వెళ్తున్నట్టు నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.ఆయన ఎస్ఎస్ఎంబి 29 మూవీ అవుట్ పుట్ గురించి మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చాలా బాగుంది.ఈ అవుట్ పుట్ మాకు సంతృప్తినిచ్చింది.నెక్స్ట్ షెడ్యూల్ నైరోబి అలాగే టాంజానియాలో ప్లాన్ చేశాం.నెక్స్ట్ షూటింగ్ అక్కడే జరుగుతుంది" అంటూ నిర్మాత.. మహేష్ బాబు , రాజమౌళి మూవీ షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. కానీ ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో ఉంటుందని, ఎంతో హైప్ ఇస్తున్నారు. అయితే రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు లీక్ అవుతున్నాయి.. దాంతో రాజమౌళి షూటింగ్ స్పాట్ లో టైట్ సెక్యూరిటీని పెట్టారట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు, రాజమౌళి సినిమాకి సంబంధించి బయటపడ్డ చిన్న చిన్న లీక్డ్ వీడియోల ద్వారా సినిమాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొంతమందేమో విలన్ మహేష్ బాబును గుప్త నిధుల కోసం అడవులకు పంపిస్తాడని.. అడవుల్లో మహేష్ బాబు అడ్వెంచర్స్ చేస్తారని అంటుంటే.. మరికొంతమందేమో ఈ సినిమా కాశీ నుండి మొదలై చివరికి అడవుల్లో ముగుస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పురాణ కథలు అలాగే అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. మరి అసలు సినిమా ఏంటి అనేది విడుదలైతే గానీ తెలియదు. మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీ రోల్ లో నటిస్తున్నారు.