కొత్త షెడ్యూల్ కోసం భారీ ప్లాన్స్
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 ఇప్పుడు తర్వాతి షెడ్యూల్ కు సిద్ధమవుతుంది.;
టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ29 కూడా ఒకటి. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారని ఇప్పటికే ఆయన లుక్ చూస్తుంటే తెలుస్తోంది.
మామూలుగా అన్ని సినిమాలనూ అనౌన్స్ చేశాకే సెట్స్ పైకి తీసుకెళ్లే రాజమౌళి ఈ సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా చాలా సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ విషయంలో ఫ్యాన్స్ చాలా కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ29 ప్రీ లుక్‌కు భారీ రెస్పాన్స్
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 ఇప్పుడు తర్వాతి షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఆగస్ట్ 21 నుంచి మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను ప్రధాన పాత్రధారులపై తెరకెక్కించనున్నారట. కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డే సందర్భంగా ఓ ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో..
యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మరికొందరు ఇంటర్నేషనల్ యాక్టర్లు కూడా ఈ ఎస్ఎస్ఎంబీ29లో భాగమయ్యే అవకాశాలున్నాయి. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.