• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB29: 50లో ఇది నెవ్వర్...

SSMB29: 50లో ఇది నెవ్వర్ బిఫోర్ లుక్

| టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 మీద బీభత్సమైన హైప్ కొనసాగుతోంది.

By - Tupaki Desk
Update: 2025-07-20 11:11 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 మీద బీభత్సమైన హైప్ కొనసాగుతోంది. ఇండియన్ సినిమా రేంజ్ ను దాటేలా, దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

 ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ పోస్టర్ కానీ టీజర్ కానీ విడుదల కాకపోయినా.. సినిమా మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. కథ, విలన్, లొకేషన్స్, మేకింగ్.. ఇలా అన్ని విషయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఇటీవల కనిపించిన ఓ స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంద. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ వెనుక రాజమౌళి మార్క్ ఫీలా ఉందంటూ ఊగిపోతున్నారు.

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైన మహేష్ బాబు, బ్లాక్ హూడీ మరియు బ్లూ జీన్స్‌లో కనిపించారు. వేవీ హెయిర్, డార్క్ బార్డ్ లుక్‌తో మహేష్ సింప్లీ రాకింగ్‌గా ఉన్నారు. సింపుల్ కాస్ట్యూమ్‌ లోనూ ఇలా డిఫరెంట్‌గా కనిపించడం ఫ్యాన్స్‌ను శాక్‌కు గురి చేసింది. ఇది SSMB29 సినిమా కోసం చేస్తున్న లుక్ ట్రాన్స్ఫర్మేషన్‌లో భాగమేనని టాక్.

మహేష్ వయసు ఇప్పటికే 50లోకీ వచ్చేసింది. ఈ క్రమంలో పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం అనేది సో స్పెషల్. ఫ్యాన్స్ మాత్రమే కాదు, నెటిజన్లు, సినిమా ప్రేమికులంతా మహేష్ బాబుని ఈ కొత్త లుక్ లో చూసి తెగ మంత్రముగ్ధులైపోతున్నారు. సోషల్ మీడియా అంతా ఆ ఫోటోలతో నిండిపోయింది. ‘రాజమౌళి మిరాకిల్ మొదలైపోయింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ స్టైలిష్ లుక్ చూస్తుంటే SSMB29లో ఆయన పాత్ర ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్టే.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

Tags:    
  • SSMB29 
  • MaheshBabu 
  • SSMB29Update 
  • Rajamouli 
  • MaheshRajamouli 
  • MaheshNewLook 
  • TollywoodBiggie 
  • PanIndiaFilm 
  • PriyankaChopra 
  • PrithvirajSukumaran 
  • MMKeeravani 
  • DurgaArts 
  • MegaBudgetFilm 
  • AdventureAction 
  • IndianCinema2025 
  • SuperstarMaheshBabu 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS