రాజమౌళి అప్డేట్ ఇస్తే 'అరుపులే'
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడూ లేనంత హై రేంజ్‌లో వస్తున్న మూవీ SSMB29. ఈ చిత్రం పాన్ వరల్డ్ స్కేల్‌లో, వెయ్యి కోట్లకుపైనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.;
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడూ లేనంత హై రేంజ్‌లో వస్తున్న మూవీ SSMB29. ఈ చిత్రం పాన్ వరల్డ్ స్కేల్‌లో, వెయ్యి కోట్లకుపైనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాటేమిటంటే, ఇప్పటి వరకు మామూలుగా వచ్చిన పాన్ ఇండియా మూవీస్ అన్నీ SSMB29 ముందు చిన్నవే అనిపించేలా ఉండబోతున్నాయట. మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఓ అడ్వెంచరస్ ట్రావెలర్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు. ఆయన పాత్రను ప్రపంచ స్థాయి లెవెల్‌లో డిజైన్ చేయడం కోసం దర్శకుడు రాజమౌళి స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఇక అప్డేట్ విషయంలో కూడా ఒక టాక్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇంటర్నేషనల్ లెవెల్లో..
ఈ సినిమా చుట్టూ ఎన్నో ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌసెస్, హాలీవుడ్ ఏజెన్సీస్ భాగస్వామ్యం చేయడానికి రెడీగా ఉన్నాయని టాక్. అందుకే ప్రస్తుతం ఒక్క ఫోటో అయినా, అప్డేట్ అయినా బయటికి రావడానికి టీమ్ స్పేస్ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు SSMB29 గురించి ఒక్క చిన్న అప్డేట్, బాగ్రౌండ్ ఫొటో కూడా సోషల్ మీడియాలోకి లీక్ కాలేదు. రాజమౌళి మాత్రం తన స్టయిల్లో తానే టైమ్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తానంటూ స్పష్టంగా చెబుతున్నారు. యూనిట్ నుంచీ ఎవరూ అధికారికంగా మాట్లాడకుండా చాలా కేర్‌ఫుల్‌గా ప్రాజెక్ట్‌ను రన్ చేస్తున్నారు.
మహేష్ ఫ్యాన్స్ వెయిట్ తప్పదు
మరో పదిరోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు రావడంతో ఫ్యాన్స్ అందరూ ఓ స్పెషల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ ఏడాది మాత్రం ఎలాంటి పోస్టర్, గ్లింప్స్, మేకింగ్ వీడియో ఇచ్చే సిగ్నల్స్ అయితే రావడం లేదు. SSMB29 ని 2027లో రిలీజ్ చేయాలనేది అసలు ప్లాన్, అందుకే వచ్చే ఏడాది బర్త్‌డే (2026)కి మాత్రమే ఓ పవర్ఫుల్ అప్డేట్ ఉండొచ్చని అంటున్నారు. అప్పటివరకూ, ఎవ్వరూ ఏ అఫిషియల్ అప్డేట్ ఆశించవద్దని రాజమౌళి టీమ్ చెప్పకనే చెబుతోంది. ఇక అంత వరకూ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.
అప్డేట్ ఇస్తే అరుపులే
ఇతర ప్రొడక్షన్ హౌసెస్‌తో డీల్స్ పూర్తయ్యే వరకూ ఎలాంటి మీడియా మీట్, మేకింగ్ ఫుటేజ్ బయటకు ఇవ్వబోమని రాజమౌళి తేల్చిచెప్పారట. అంతేకాదు, అంతర్జాతీయ ప్రమోషన్, ఆస్కార్ క్యాంపెయిన్ లాంటి విషయాల్లో ప్రమేయం ఉండేలా చాలా లార్జ్ స్కేల్‌లో ప్లానింగ్ చేస్తున్నారు. పూర్తిగా పాట్నర్స్ ఫిక్స్ అయ్యాకే సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన ఈవెంట్, పోస్టర్ రిలీజ్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఆలస్యం అయినా కూడా రాజమౌళి అప్డేట్ ఇస్తే అరుపులే అనే రేంజ్ లో ఉంటుందని అర్ధమవుతుంది.
ఆ పనుల్లో బిజీబిజీగా..
ఆఫ్రికా షెడ్యూల్‌తో పాటు, హైదరాబాద్‌లోని స్పెషల్ వరణాసి సెట్‌లో జరిగే కీలక పార్ట్ షూటింగ్ కోసం కూడా ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. తాజాగా ఎం.ఎం.కీరవాణి తో రాజమౌళి మ్యూజిక్ సెషన్స్ మొదలుపెట్టారని సమాచారం. ఇంకా సినిమాకు సంబంధించి కాస్ట్, టెక్నీషియన్ డీటెయిల్స్ పూర్తిగా అధికారికంగా బయటకి రావాల్సి ఉంది. మొత్తం మీద, SSMB29 ఫ్యాన్స్ ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే. అప్డేట్ వస్తే మాత్రం సోషల్ మీడియాలో అరుపులే అనేలా మారబోతోంది.