మహేష్-29, బన్నీ-22 టార్గెట్ ఎంత?
రాజమౌళి 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆ'ర్ లాంటి సినిమాలతో బాక్సాపీస్ వద్ద 1500 కోట్ల మార్క్ ను చూసేసారు. అట్లీ కూడా 'జవాన్' సక్సెస్ తో 1000 కోట్ల మార్క్ ను చూసేసారు.;
ఎస్ ఎస్ ఎంబీ -29, బన్నీ -22 చిత్రాలిప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మహేష్ సినిమాకు రాజమౌళి దర్శకుడైతే...బన్నీ సినిమాకు యువ సంచలనం అట్లీ దర్శకు డిగా పనిచేస్తున్నారు. రాజమౌళి 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆ'ర్ లాంటి సినిమాలతో బాక్సాపీస్ వద్ద 1500 కోట్ల మార్క్ ను చూసేసారు. అట్లీ కూడా 'జవాన్' సక్సెస్ తో 1000 కోట్ల మార్క్ ను చూసేసారు.
బన్నీ కూడా 'పుష్ప2' తో 1800 కోట్ల వసూళ్లను చూసేసాడు. మరిప్పుడు ఇప్పుడీ నయా డైరెక్టర్ల ఇద్దరి టార్గెట్ ఎంత అంటే? 2500 కోట్లపైనా ఉంది. అంతకు మించి తగ్గడానికి ఏమాత్రం వీలు లేదు. ఇక్కడ వసూళ్లు అన్నది రెండు కోణాల్లో చూడాలి. మహేష్ ఇంత వరకూ 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరలేదు. కానీ అతడి సినిమాకు దర్శకత్వం వహిస్తుంది గ్లోబల్ రేంజ్ ఉన్న రాజమౌళి. అతడు కథాబలంతోనే సినిమాను నడిపించాలని చూస్తాడు.
అతడి కథలో హీరో పాత్ర అన్నది కొంత శాతమే పరిమితం. ఆ ఫరిది దాటిన తర్వాత సినిమాను నడిపిం చాల్సింది కథ..అందులో పాత్రలు మాత్రమే. ఆ విషయంలో చూడాల్సిన పనిలేదు. రాజమౌళి టేకింగ్... విజయేంద్ర ప్రసాద్ రైటింగ్ తో 2500 కోట్ల వసూళ్లు అన్నది పెద్ద విషయం కాదు. వాళ్ల క్రియేటివిటీకి మహేష్ ఇమేజ్ తోడైతే లెక్క అంతకు మించే ఉంటుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' తో ఏకంగా 2000కోట్ల మార్క్ కు చేరువలోకి వచ్చాడు.
ఆ సినిమా ఏకంగా 1800 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ నెంబర్ చిత్రంగా మారింది. అతడి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే అట్లీ బలమైన ఎమోషన్ కంటెంట్ తో శంకర్ రేంజ్ లో టెక్నికల్ గా హైలైట్ చేసే ప్రయ త్నానికి పూనుకున్నాడు. ఓ కథని కమర్శియల్ గా చెప్పడంలో అట్లీ దిట్ట. జవాన్ కథని అలా సక్సస్ చేసే 1000 కోట్ల వసూళ్లను చేధించగలిగాడు. అలాంటి మేకర్ కి బన్నీ తోడైతే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు. ఈ రెండు సినిమాల బడ్జెట్లు కూడా వందల కోట్లు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పకుండా ముందుకెళ్తున్నారు.