• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారణాసితో రాజమౌళి మరో...

వారణాసితో రాజమౌళి మరో రికార్డ్ వేట.. ఇండియన్ సినిమాకు కొత్త ఫార్మాట్!

| ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే అంశం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-08-03 08:21 GMT

రాజమౌళి సినిమాల గురించి డిస్క‌ష‌న్ వచ్చినప్పుడు ఎక్కువగా వినిపించే పదం స్కేల్. అయితే ఆయన ప్రత్యేకత కేవలం భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాలు లేదా విజువల్ ఎఫెక్ట్స్ వరకే పరిమితం కాదు. కథ చెప్పే విధానం నుంచి ప్రేక్షకుడు థియేటర్‌లో సినిమాను ఎలా ఎక్స్‌పీరియెన్స్ చేయాల‌నే అంశం వరకు ముందుగానే ఆలోచించడం ఆయన ఫిల్మ్‌మేకింగ్‌లో కనిపించే పెద్ద తేడా. ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే అంశం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

ఇండియ‌న్ డైరెక్ట‌ర్ల‌లో చాలామంది కథకు తగిన లొకేషన్లు, నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెడితే, రాజమౌళి మాత్రం కథను ఏ ఫార్మాట్‌లో చెప్పాలి అనే ప్రశ్నను కూడా అంతే ప్రాధాన్యంగా తీసుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వారణాసిని రెగ్యుల‌ర్ కమర్షియల్ రిలీజ్ లాగా కాకుండా, థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

ఈ సినిమా గురించి వస్తున్న డిస్క‌ష‌న్స్ లో ఎక్కువ‌గా వినిపిస్తున్న అంశం ఐమ్యాక్స్ ఫార్మాట్. అయితే ఇది కేవలం ప్ర‌మోష‌న్స్ కోస‌మో, హైప్ క్రియేట్ చేయ‌డం కోసమో తీసుకున్న నిర్ణయం కాదనే అభిప్రాయం ఇండ‌స్ట్రీలో బ‌లంగా వినిపిస్తోంది. కథలోని ప్రపంచాల విస్తృతి, వాటి ఎత్తు, లోతు, పరిమాణాన్ని ఆడియ‌న్స్ కు అనుభూతి కలిగించేలా చూపించాలంటే పెద్ద కాన్వాస్ అవసరమనే ఆలోచనతోనే రాజ‌మౌళి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బ‌ట్టి చూసుకుంటే ఫార్మాట్‌ను కథకు అనుగుణంగా ఎంచుకోవడం రాజమౌళి పని విధానంలో భాగమైందని చెప్పొచ్చు.

ఈ అంశ‌మే వారణాసిని ఇండియ‌న్ సినిమాను కొత్త ఫార్మాట్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా నిలబెడుతోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా అంటే భాషల విస్తరణ, మార్కెట్ విస్తరణ అనే యాంగిల్ లో డిస్క‌ష‌న్ జరిగితే, ఇప్పుడు ప్రెజెంటేషన్ ఫార్మాట్ కూడా ఆ డిస్క‌ష‌న్ లో భాగమవుతోంది. ఒక ఇండియ‌న్ సినిమా మొదటి దశ నుంచే ప్రపంచ స్థాయి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కొత్త ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది.

రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే ప్రతి సినిమా తర్వాత ఆయన టార్గెట్ బాక్సాఫీస్ లిమిటేష‌న్స్ ను దాటిపోవడమే కాకుండా, ఇండియ‌న్ సినిమా నిర్మాణ ప్రమాణాలను కూడా మార్చాలనే ప్రయత్నం కనిపిస్తుంది. వారణాసి కూడా అదే దిశలో మరో అడుగుగా మారే అవకాశముంది. కథకు సరిపోయే టెక్నాలజీని ఎంచుకోవడం, ప్రేక్షకుడి అనుభవాన్ని కేంద్రంగా ఉంచి ఫార్మాట్‌ను డిజైన్ చేయడం, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయి థియేట్రికల్ ప్రెజెంటేషన్ వైపు నడిపించడం వంటి అంశాల వల్ల వార‌ణాసిపై ఉన్న ఆసక్తి మరింత పెరుగుతోంది. ఐమ్యాక్స్ ను ఒక టెక్నికల్ ఫీచర్‌గా కాకుండా కథ చెప్పే సాధనంగా ఉపయోగించాలనే ఆలోచనే రాజమౌళిని ఇండియ‌న్ డైరెక్ట‌ర్ల‌లో ప్రత్యేకంగా నిలబెడుతోంది.

Tags:    
  • ssrajamouli 
  • varanasi 
  • maheshbabu 
  • rajamouli 
  • tollywood 
  • imax 
  • panindiamovie 

Similar News

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS