వారణాసి.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారణాసి వరల్డ్ అంటూ వచ్చిన ఆ గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుంది.;

Update: 2026-01-05 11:08 GMT

వారణాసి.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ అది. దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఆ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గ్లోబ్‌ ట్రాటింగ్‌ కాన్సెప్ట్‌ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారణాసి వరల్డ్ అంటూ వచ్చిన ఆ గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా విశేష స్పందన లభించింది. రాజమౌళి సినిమాల్లో ఉండే భారీ స్థాయి, విజువల్‌ గ్రాండియర్‌ గ్లింప్స్ లో స్పష్టంగా కనిపించిందని అంతా అభిప్రాయపడ్డారు.

అయితే ఆ గ్లింప్స్ రిలీజ్ చేసిన ఈవెంట్ లో సినిమాను 2027 వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు డేట్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. 2027 ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట.ఆ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాలో రుద్రగా మహేష్ బాబుకనిపించనున్నారు.

శ్రీ రాముడిగా కూడా కొన్ని సీన్స్ లో సందడి చేయనున్నారు. అందుకే శ్రీరామ నవమి కానుకగా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక వారణాసి సినిమా విషయానికొస్తే.. మహేశ్‌ బాబు లీడ్ రోల్ లో నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో మందాకినిగా కనిపించనున్నారు. మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో ముఖ్యమైన పాత్ర కుంభగా యాక్ట్ చేస్తున్నారు. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌ తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి నిలవనుంది. కేఎల్‌ నారాయణ నిర్మిస్తుండగా, రాజమౌళి కుమారుడు ఎస్‌ ఎస్‌ కార్తికేయ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్‌ విజేత ఎంఎం కీరవాణి అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్‌ కథ, స్క్రీన్‌ప్లే రాశారు.

ఇంకో విశేషం ఏమిటంటే, సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ లు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న వారణాసి.. అనేక భాషల్లో విడుదల కానుంది. మరి మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News