హీరో మంచోడైతే నేను రెడీ అంటున్న అమ్మడు..!
ఓజీ సినిమా చూసిన వాళ్లందరికీ శ్రీయా రెడ్డి పేరు గుర్తుంటుంది. ఎందుకంటే ఆమె చేసిన రోల్ ఇంప్రెస్ చేస్తుంది.;
ఓజీ సినిమా చూసిన వాళ్లందరికీ శ్రీయా రెడ్డి పేరు గుర్తుంటుంది. ఎందుకంటే ఆమె చేసిన రోల్ ఇంప్రెస్ చేస్తుంది. ఓజీ మాత్రమే కాదు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ సినిమాలో కూడా ఆమె నటించింది. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే శ్రీయా రెడ్డి ప్రశాంత్ నీల్ తనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ కావాలి.. అది కూడా మీ మగ హీరోలంతా మంచి వాళ్లు అయినప్పుడే అంటూ చెప్పిందట.. దానికి ప్రశాంత్ నీల్ మీ యాటిట్యూడ్ నాకు నచ్చిందని ఆమెకు సలార్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట.
ఓజీ సినిమాల..
ఇక సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమాలో కూడా మరో పవర్ ఫుల్ రోల్ లో నటించింది శ్రీయా రెడ్డి. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె డైరెక్టర్ సుజిత్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. సుజీత్ తనకు రాసిన క్యారెక్టర్ అద్భుతం సృష్టించింది. ఓజీ లాంటి సినిమా చేయడం.. అందులో గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్ అవసరం. సుజీత్ అలాంటి డైరెక్టరే అన్నారు శ్రీయా రెడ్డి.
ఈ రోల్ కి తనని సెలెక్ట్ చేసినందుకు థాంక్స్. ఎప్పుడైనా సరే ఉన్నతంగా ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో మీకు ఒకరు.. సుజీత్ ఈ విజయానికి మీరు పూర్తి అర్హులు అంటూ రాసుకొచ్చింది. కృషి, విశ్వాసం, మీరు చేసిన త్యాగాలు అన్నీ ఈ సినిమా విజయానికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు శ్రీయా రెడ్డి.
తగిన పాత్ర ఇస్తే ఎప్పుడైన..
తనకు తగిన పాత్ర ఇస్తే ఎప్పుడైనా సరే తాను నటించేందుకు రెడీ అంటూ శ్రీయా రెడ్డి మరోసారి ప్రూవ్ చేశారు. కెరీర్ మొదలు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా తనకు సూటయ్యే పాత్రలు చేస్తూ వచ్చారు ఆమె. ఐతే ఫిమేల్ నెగిటివ్ రోల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ శ్రీయా రెడ్డి అందులో కూడా తన స్పెషాలిటీ చాటుతూ వచ్చారు.
శ్రీయా రెడ్డి హీరోలు, కాంబినేషన్స్ బట్టి సినిమా చేయరు.. కథలో తన పాత్ర బాగుంటే చేస్తారు. సలార్ 1, ఓజీ ఇలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె భాగం అయ్యారు. కచ్చితంగా ఈ సినిమాల ఇంపాక్ట్ తో ఆమెకు మరిన్ని తెలుగు ఆఫర్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి.