• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ అమ్మడికి...

టాలీవుడ్ అమ్మడికి నచ్చినట్టు ఉందే..!

| కె.జి.ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ సినిమా రెండు భాగాలతో అలరించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో సినిమాకు కాస్త టైం తీసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-05-25 04:00 GMT

కె.జి.ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ సినిమా రెండు భాగాలతో అలరించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో సినిమాకు కాస్త టైం తీసుకుంది. చియాన్ విక్రమ్ తో కోబ్రా చేసిన అమ్మడు ఆ సినిమా ఫెయిల్యూర్ తో షాక్ తిన్నది. కె.జి.ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక ఏ హీరోయిన్ అయినా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది కానీ శ్రీనిధి మాత్రం దానికి రివర్స్ లో ఏరి కోరి సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా అమ్మడు తెలుగులో హిట్ 3 తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. నాని తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అమ్మడు టాలీవుడ్ కి సూపర్ హిట్ తో ఎంట్రీ ఇచ్చింది.

అసలైతే శ్రీనిధి తెలుగులో మొదట సైన్ చేసిన సినిమా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తెలుసు కదా. నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సైన్ చేసిన శ్రీనిధి ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే హిట్ 3 కి ఓకే చెప్పడం ఆ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా తెలుగు ఎంట్రీ శ్రీనిధికి కలిసి వచ్చింది. అంతేకాదు ఇక్కడ వాతావరణం అమ్మడికి బాగా నచ్చేసినట్టు ఉంది. తెలుసు కదా ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

చూస్తుంటే శ్రీనిధి కూడా ఇక మీదట వరుసగా తెలుగు సినిమాలే చేయాలని చూస్తున్నట్టు ఉంది. ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి శ్రీనిధిని మరో పాన్ ఇండియా సినిమాలో సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక అమ్మడి కెరీర్ కి తిరుగు ఉండదని చెప్పొచ్చు. సిద్ధుతో చేస్తున్న తెలుసు కదా సినిమాకు కూడా శ్రీనిధి లక్ కలిసి వచ్చేలా ఉంది. హిట్ 3 సినిమా చేయడమే కాదు నానితో కలిసి ప్రతి ప్రమోషనల్ యాక్టివిటీలో శ్రీనిధి పాల్గొన్న తీరు ఆమె మీద తెలుగు ఆడియన్స్ ప్రేమ చూపించేలా చేసింది.

మరి శ్రీనిధి తెలుగులో కెరీర్ ఎలా కొనసాగిస్తుంది. తెలుసు కదా తర్వాత ఆమె ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది చూడాలి. హిట్ 3 సక్సెస్ తో శ్రీనిధి శెట్టి పేరు టాలీవుడ్ లో హెడ్ లైన్స్ లో ఉంది. సో తప్పకుండా ఆమెకు ఇక్కడ మంచి కెరీర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు అమ్మడు కన్నడలో కూడా ఒకటి రెండు సినిమాలు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

Tags:    
  • SrinidhiInTollywood 
  • TeluguFilms 
  • HIT3Success 
  • SiddhuJonnalagadda 
  • NeerajKona 
  • KGFActress 
  • Tollywood 
  • HIT3Movie 
  • SrinidhiShetty 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS