ఓదెల ప్లాన్ ఏంటి? 'మల్టీవర్స్' బాస్ గా మారుతారా?
ఇలాంటి సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు ఇప్పుడు వినిపిస్తోంది. దసరా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సినిమాటిక్ యూనివర్స్ లు, మల్టీవర్స్ లపై ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ మార్వెల్ తరహా యూనివర్స్ లు భారీ విజయాలు సాధించిన తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా అలాంటి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ కాన్సెప్టును లాంగ్ రన్ లో సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేసిన ఎగ్జాంపుల్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ ఫుల్ యూనివర్స్ గా ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన హిట్ ఫ్రాంచైజీ. హిట్: ది ఫస్ట్ కేస్ తో మొదలైన ఆ సిరీస్ ఇప్పటికే మూడు పార్టులు పూర్తి చేసుకుంది. ప్రతి పార్ట్ లో కొత్త కథ, కొత్త హీరోతో ముందుకు వెళ్తూనే, ఒకే వరల్డ్ కు సంబంధించిన లింక్ ను కొనసాగించడం ఆ సిరీస్ ప్రత్యేకతగా నిలిచింది.
శైలేష్ కొలను ముందుగానే ఆ ప్రాజెక్టుకు పెద్ద ప్లాన్ రెడీ చేశారు. మొత్తం ఏడు పార్టులుగా ఆ యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే టార్గెట్ తో సాగుతున్నారు. మొదటి ఆరు పార్టుల్లో వేర్వేరు లీడ్ రోల్స్ ను పరిచయం చేసి, ఏడో పార్టులో వారందరినీ ఒకే కథలో మిక్స్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో హిట్ యూనివర్స్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
మరోవైపు దర్శకుడు సుజీత్ కూడా తన సినిమాలను ఒకే యూనివర్స్ లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. సాహో, ఓజీ చిత్రాల మధ్య లింక్ ఉందనే చర్చ ఇప్పటికే సాగుతోంది. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఫ్యూచర్ లో మరిన్ని కథలను లింక్ చేసే ప్లాన్ ఉందని చెప్పారు. అయితే ఆ యూనివర్స్ ఇంకా పూర్తిగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అందుకే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.
ఇలాంటి సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు ఇప్పుడు వినిపిస్తోంది. దసరా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓదెల సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ది ప్యారడైజ్, చిరంజీవి చిత్రాల మధ్య ఏదో ఒక లింక్ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఆ రెండు సినిమాల ద్వారా ఓదెల తన సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో ఒక యూనివర్స్ ను సక్సెస్ ఫుల్ గా నిలబెట్టాలంటే కేవలం కనెక్షన్లు చూపించడం సరిపోదు. స్ట్రాంగ్ స్టోరీస్, ఆకట్టుకునే పాత్రలు, లాంగ్ ప్లాన్ అవసరం. ఆ విషయంలో శైలేష్ కొలను ఇప్పటికే విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాంత్ ఓదెల కూడా తన సినిమాల ద్వారా కొత్త యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నారా? ఆకట్టుకునే ఫ్రాంచైజీని రూపొందించగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే ది ప్యారడైజ్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఓదెల నెక్స్ట్ స్టెప్స్ పై అందరి ఫోకస్ ఉంది.