శ్రీలక్ష్మి సినీ ప్రయాణం అమ్మ బెదిరింపుతో!
మానాపురం లక్ష్మి అలియాస్ శ్రీలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం ఆమె సొంతం.;
మానాపురం లక్ష్మి అలియాస్ శ్రీలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం ఆమె సొంతం. నేటి జనరేషన్ హీరోలతో కూడా సినిమా లు చేయడం ఆమెకే సాధ్యమైంది. తెలుగు తెర హాస్య నటి ఎవరంటే? ఠక్కున గుర్తొచ్చే పేరు అది. అప్పట్లో శ్రీలక్ష్మి లేకుండా జంధ్యాల సినిమాలుండేవి కాదు. ఆయన సినిమాలో ఏదో ఒక పాత్ర పోషించడం ఆమెకే సాద్యమైంది. అలా అప్పటి జనరేషన్ దర్శకులతో పాటు నేటి జనరేషన్ తోనూ పని చేయడం విశేషం.
ఇప్పటికీ అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇదే ఏడాది రిలీజ్ అయిన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంలోనూ నటించారు. అంతటి లెజెండరీ నటి సినిమాల్లోకి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? అన్నది రివీల్ చేసారు. `అమ్మ-నాన్నలకు ఆరుగురు సంతానం. నాన్న అమర్ నాధ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారన్నారు. కానీ నాన్న సినిమా నిర్మాతగా మారడంతో ఆర్దికంగా నష్టపోయారు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేయలేకపోయారన్నారు.
`అదే సమయంలో ఆరోగ్యం కూడా క్షీణించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింద`న్నారు. తాను సినిమాలు చేస్తానంటే నాన్న ఒప్పుకునేవారు కాదని, కానీ చివరికి ఆయన్ని ఒప్పించి `శుభోదయం` సినిమాతో తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తండ్రి చనిపోవడంతో? కుటుంబంలో పెద్ద తానే అవ్వడంతో ఆ బాధ్యతలు తనపై పడ్డాయన్నారు. దీంతో తల్లి తన జీవితాన్ని త్యాగం చేస్తే ఇంట్లో అందరూ బ్రతకొచ్చు. లేదంటే విషం తాగి చనిపోవడమే గత్యంతరంగా మాట్లాడినట్లు శ్రీలక్ష్మి వాపోయారు.
దీంతో అన్ని విషయాలు పక్కన బెట్టి నటిగా కెరీర్ మీద ఫోకస్ చేసి ముందుకు సాగినట్లు వెల్లడించారు. శ్రీలక్ష్మి సినీ ప్రస్తానం ఇండస్ట్రీలో అలా మొదలైంది. కుటుంబ పరిస్థితులు కారణంగానే శ్రీలక్ష్మి కూడా నటిగా కెరీర్ ఆరంభించింది. అప్పట్లో చాలా మంది నటీమణులు కొంత మంది ఫ్యాషన్ తో వస్తే? మరి కొంతమంది ఇష్టం లేకపోయినా? అవసరం సినిమాలవైపు తీసుకెళ్లింది. ఇష్టం లేకపోయినా సినిమాల్లో నటించేవారు. కానీ నేడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. నటిగా అవకాశం రావాలంటే? అద్భుతం జరగాలి. అలా జరిగినా? రెండవ ఛాన్స్ వస్తుందో? లేదో కూడా చెప్పలేని పరిస్థితి.